
మేషం:
బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మనపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి.. ఈరోజు మేష రాశివారికి మంచి విజయం చేకూరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుదిరు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.
వృషభం:
దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. విలువైన వస్తువులను కొంటారు. వృత్తి వ్యాపారులు మంచి మార్పులు చేస్తారు.
మిథునం:
ఇష్టదైవ దర్శనంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గండాల్లో ఉంటాయి. కుటుంబ సభ్యులు ఒక చిన్న విషయంపై గొడవ పడతారు.
కర్కాటక రాశి
కుటుంబం విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. బంధుమిత్రులతో వివాదాలు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడిని కలిగిస్తుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
సింహ రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొదలుపెట్టిన పనులను సకాలంలోనే పూర్తి చేస్తారు. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది.
కన్య:
అనుకున్న సమయానికే మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఒక విషయంపై ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.
తుల:
అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు చేసే ముందు ఆలోచించండి. ఇంట్లో కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. మొదలుపెట్టిన పనులు అనుకోకుండా మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగులకు వ్యయప్రయాసలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.
వృశ్చికం:
మునపటి కంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఒక విషయంపై గొడవ పడతారు. మొదలుపెట్టిన పనులు నత్త నడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఓ మాదిరిగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు.
ధనుస్సు:
ఆర్థిక లావాదేవీలతో మంచి లాభాలను అర్జిస్తారు. ఇంటికి బందువులు రావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆస్థికి సంబంధించిన వ్యవహారాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
మకరం:
బంధువులు మాటలతో ఇబ్బంది పెడతారు. వృత్తి వ్యాపారులు పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులకు విశ్రాంతి దొరక్క ఒత్తిడికి లోనవుతారు. మొదలుపెట్టిన పనులు ముందకు సాగవు. అవసరానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి
మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు. సొంత నిర్ణయాలతో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు.
మీనం:
ఒక విషయంపై స్నేహితులతో గొడవలు వస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వ్యాపారులు నష్టాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు ముందకు సాగవు. ఉద్యోగులకు అధికారులతో మాట పట్టింపులు వస్తాయి.