సింహరాశిలోకి బుధుడు...నెలరోజులు ఈ మూడు రాశులకు అదృష్టమే..!

First Published | Jul 23, 2024, 5:00 PM IST

సింహ రాశిలో ఉన్న సమయంలో.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం...
 

Mercury is the planet

జోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు నిర్దిష్ట కాలం తర్వాత సంచరిస్తాడు. బుధుడు తెలివికి చిహ్నంగా పరిగణిస్తారు. జులై 19వ తేదీన బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 21 వరకు సింహరాశిలోనే ఉంటాడు.  తర్వాత...  కర్కాటక రాశిలోకి మారిపోతాడు. అయితే.. సింహ రాశిలో ఉన్న సమయంలో.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం...

telugu astrology

1.మిథున రాశి..
సింహ రాశిలోకి బుధుడి సంచారం.. మిథున రాశివారికి చాలా మేలు చేస్తుంది.  ఈ కాలంలో.. ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అవుతారు. శ్రమతో అనుకున్న విజయం సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు. రావాల్సిన డబ్బు వచ్చేస్తసుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. పెళ్లి కావాల్సిన వాళ్లకు పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి.


telugu astrology


2.సింహరాశి..
సింహరాశి వారికి బుధ సంచారం కూడా చాలా శుభప్రదం. ఈ సమయంలో సమస్యలన్నీ పరిష్కారమౌతాతయి.  ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పిల్లలు సంతోషకరమైన వార్తలు వింటారు. సింహ రాశివారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. రుణం తీర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది. వాహనం, ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

telugu astrology

3.కుంభ రాశి.. 

కుంభరాశి వారికి బుధ సంచారం కూడా చాలా శుభప్రదం. ఈ రాశి వారికి ఈ కాలం చాలా మంచిది. ఈ కాలంలో కుంభ రాశివారి ఆర్థిక స్థితి బాగుంటుంది. అప్పులు తీరతాయి. జీవితంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. వారికి ఉన్న అప్పులు తీరడంతో పాటు.. రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చేస్తాయి.   కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. సీనియర్ల సహాయం అందుతుంది. విద్యార్థులకు కూడా మంచి సమయం. ఈ కాలంలో కెరీర్‌లో విజయాలు, ప్రమోషన్‌లు అందుకుంటారు. 

Latest Videos

click me!