Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి

First Published Feb 23, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలించి లాభిస్తాయి.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. 

23-2-2024శుక్రవారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.


భరణి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి పొందుతారు.

కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి .

దిన ఫలం:-చేయు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లో ధనలాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క ఆదరణ అభిమానం పొందగలరు.అనుకూలమైన వాతావరణం. కుటుంబ అభివృద్ధి కలుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

మృగశిర నక్షత్రం వారికి  (దినపతి రాహు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.

దిన ఫలం:-వచ్చిన అవకాశాన్ని చేజారుస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాలు ప్రతికూలత వాతావరణం. సంతానంతో విరోధాలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనిలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఇతరుల యొక్క వ్యవహారాలలో హామీలకు దూరంగా ఉండాలి. సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ .

పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు.

దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలించి లాభిస్తాయి.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా లాభపడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలిస్తాయి.వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ధైర్యంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సఖ్యత లభించును.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి గురుడు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి .

దిన ఫలం:-వ్యవహారాలలో తికమకగా ఉండటం. భయాందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలో చిక్కులు. సమాజంలో అపనిందలు అపవాదము ఎదుర్కోవలసి వస్తుంది. శతృభీతి అధికముగా ఉండును. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. ఆదాయమును మించి అధికముగా ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా వచ్చే  ఉద్రేక కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగాల్లో అధికారులతో వాదోపవాదములు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి పొందుతారు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (దినపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.ఇంటా బయటా అధికమైన ఒత్తిడిలు పెరుగుతాయి . నిత్యవసరాలకు ఋణములు చేయవలసి వస్తుంది. అకారణంగా బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. మనసునందు ఆందోళనగా ఉండటం. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాగలవు. చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాల తో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదములు రాగలవు

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

చిత్త నక్షత్రం వారికి  (దినపతి రాహు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.

దిన ఫలం:-సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. చేయు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలించును.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి  (దినపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ.

విశాఖ  నక్షత్రం వారికి (దినపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు .

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ఆభరణాలు కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును. సమాజములో ప్రజాభిమానం పొందుతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి గురుడు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి  (దినాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి .

దిన ఫలం:-మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. తగు జాగ్రత్త అవసరం.బంధువులు లేదా మిత్రులు ను ఓదార్చ వలసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.రావలసిన బాకీలు వసూలు గాక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కోపావేశము నియంత్రించుకోవాలి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేట మంచిది. రుణాలు చేసే విషయంలో జాగ్రత్త అవసరం.

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి(దినపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.

పూ.షాఢ నక్షత్రం వారికి(దినపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి పొందుతారు.

ఉ.షాఢ నక్షత్రం వారికి(దినపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి .

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించును. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్త వింటారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
 

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి రాహు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.

దిన ఫలం:-ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడును.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు ఏర్పడగలవు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారంలో పెట్టుబడి ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. చేసే వ్యవహారాలలో భావోద్వేగములు అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ఇతరులతో వాదోపవాదములకు దూరముగాఉండవలెను
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు.

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు వలన ఇబ్బందులకు గురవుతారు. ఋణ బాధలు పెరుగుతాయి . కుటుంబ సభ్యులతో   చికాకుగా వుండును. అనేక ఆలోచనలు. మనస్సులో ఉద్రేకంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నమ్మినవారు వలన మోసం జరగవచ్చు. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ఉద్యోగాల్లో అధికారులతో వాదోపవాదములు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (దినపతి గురుడు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

దిన ఫలం:-ఆర్థికంగా అనుకూలంగా ఉండును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగచేస్తుంది. సమాజంలో మీ విలువకు తగ్గ గౌరవం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. సంతానం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.

click me!