పురాణాల ప్రకారం ఏ జంతువైనా, పక్షి అయినా ఇంట్లోకి రావడం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ జీవుల్లో పాము కూడా ఒకటి. పాములు ఇంట్లోకి అకస్మత్తుగా వస్తుంటాయి. దీన్ని చూసి జనాలు కంగారు పడుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. పాములు ఇంట్లోకి వస్తే కొన్ని సంఘటలు జరుగుతాయి. మరి పాములు ఇంట్లోకి వస్తే శుభమా? అశుభమా? అసలు పాములు ఇంట్లోకి ఎందుకు వస్తాయి? వస్తే ఏం జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
శివుని కృప
పురాణాల ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము రావడం శుభసూచకంగా భావిస్తారు. దీని అర్థం మీరు శివుని ఆశీర్వాదం పొందబోతున్నారని అర్థం వస్తుంది. కాబట్టి పాము ఇంట్లోకి వెళ్లడం శుభసూచికమే.
ధన లాభం
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి పాము రావడం చాలా శుభప్రదం. మీ ఇంట్లోకి పాము వచ్చినట్టైతే మీరు భవిష్యత్తులో డబ్బును సంపాదించబోతున్నారని అర్థం. అలాగే ఇది మీకు ధనలాభం కలగడాన్ని కూడా సూచిస్తుంది.
పనులు పూర్తవుతాయి
పురాణాల ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము పిల్ల రావడం కూడా శుభప్రదమే. ఇంట్లోకి పాము పిల్ల వస్తే మీరు తలపెట్టిన పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయని ఇది సూచిస్తుంది.
సంతోషం, శ్రేయస్సు
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంట్లోకి తెల్ల పాము రావడం కూడా చాలా అరుదుగా భావిస్తారు. అలాగే ఇది ఎంతో శుభప్రదం కూడా. దీని అర్థం మీకు సంపద, ఆనందం కలగబోతుంది.
పదోన్నతి
మీ ఇంట్లోకి అకస్మాత్తుగా పసుపు రంగు పాము వస్తే కూడా శుభప్రదమే. ఇలాంటి పాములు మీ ఇంట్లోకి ఉన్నపాటుగా వస్తే మీరు త్వరలోనే జీవితంలో పురోగతిని పొందుతారని అర్థం వస్తుంది.
కష్టాలు తీరిపోతాయి
ఇంట్లోకి అకస్మాత్తుగా ఆకుపచ్చని పాము ప్రత్యక్షమవడం కూడా శుభప్రదంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీని అర్థం మీ జీవితంలో అన్ని కష్టాలు తీరబోతున్నాయి.
భార్యాభర్తల ప్రేమ..
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము రావడం కూడా చాలా శుభదాయకం. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వీరి మధ్య అనుబంధం బాగుంటుందని పురాణాలు చెబుతున్నాయి.