telugu astrology
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-నూతన వ్యాపారాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రారంభిస్తారు. ఈ రోజు మంచి ధనలాభం కలుగుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెళతారు. పెద్దల సహాయ, సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగులు మంచి పురోగతి పొందుతారు.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలకు అధిక పని బాధ్యత మీద పడుతుంది. నిరుద్యోగులు మరింత మెరుగ్గా కష్టపడాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన రుణం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
telugu astrology
మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:- మీరెంత పనిచేసినా.. తక్కువ ఫలితాన్నే పొందుతారు. మొదలుపెట్టిన పనుల్లో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. స్థిరాస్థికి సంబంధించిన గొడవలు వస్తాయి. వృత్తి వ్యాపారులు బాగా నష్టపోతారు. దైవ దర్శనం చేసుకుంటారు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు.వృత్తి ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మునపటి కంటే కాస్త మెరుగుపడుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
telugu astrology
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను ఈ రోజు మొదలుపెట్టకపోవడమే మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారుతుంది. అన్నదమ్ములతో ఆస్థికి సంబంధించిన గొడవలు జరుగుతాయి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లాభాదాయకంగా ఉంటాయి. పాత అప్పులను తీర్చేస్తారు. పుణ్యక్షేత్రాలకు కుటుంబంతో కలిసి వెళతారు. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. భాగస్వామ్య వ్యాపారాలకు ఊహించని లాభాలు కలుగుతాయి.
telugu astrology
తుల (చిత్త 3 4 స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )
దిన ఫలం:-ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగవు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. వృత్తి ఉద్యోగులు అధికారుల చర్యలతో ఇబ్బందికి గురువుతారు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:- మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. ఇంట్లో వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మీ పనులు తొందరగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండటంతో ఆనందంగా ఉంటారు. వృత్తి ఉద్యోగులకు రోజు ఆనందంగా గడుస్తుంది.
telugu astrology
ధనుస్సు (మూల, పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం: కుటుంబంతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. వృత్తి ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి పొందుతారు. పిల్లల విషయంలో బంధువులతో మాట్లాడుతారు. చిన్న నాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-మాట జారితే.. ఇతరులచే మాటలు పడాల్సి వస్తుంది. ఆదాయం తక్కువగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మనుపటి కంటే మరింత దిగజారుతుంది. ఇష్ట దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో బాగా ఒత్తిడికి గురవుతారు.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:-బందుమిత్రుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల శ్రమకు తగ్గ ఫలితం రాదు. వాతావరణ మార్పు వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో మాట పడతారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-ముఖ్యమైన వ్యాపార విషయంలో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు. ఆస్థికి సంబంధించిన సమస్య ఒకరి జోక్యంతో పరిష్కారమవుతుంది. ఆర్థిక విషయాలు ముందుకు సాగుతాయి. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.