Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

First Published | Jul 12, 2024, 5:30 AM IST

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- మీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగుండదు. కొత్త అప్పులు చేయాల్సి రావొచ్చు. మీరు ఊహించని విధంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంట్లో వారి ప్రవర్తన ఒత్తిడికి గురిచేస్తుంది. నూతన వ్యాపార విస్తరణకు అడ్డంకులు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధుమిత్రులతో చిన్న చిన్న వివాదాలు వస్తాయి. వృత్తి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు నెత్తిమీద పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఒక చిన్న విషయంలో గొడవ జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరదు. పిల్లల చదువు విషయంలో ఓ కన్నేసి ఉంచాలి.


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. అవసరానికి డబ్బు సహాయం పొందుతారు. వ్యాపార ఉద్యోగులు సొంత నిర్ణయంతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా మొదలుపెడతారు. ఇంట్లోకి విలువైన వస్తువులను కొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో ఒక ముఖ్యమైన విషయంలో గొడవ జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ప్రయాణాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగులు అధికాలతో మాట పడాల్సి వస్తుంది. 
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు. వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారులు కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. ఉద్యోగుల మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- పాత అప్పుల బాధతో కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబం విషయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అంతగా రావు. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. దైవ చింత పెరుగుతుంది. 
 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నదమ్ముల నుంచి డబ్బు సహాయం పొందుతారు. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగ అవకాశం వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. 
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- దీర్ఘకాలిక అప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.  విలువైన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. చిన్న నాటి మిత్రలును కలుసుకోవడంతో మనస్సంతా  ఆనందంతో నిండిపోతుంది. వృత్తి ఉద్యోగులు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 
 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఆస్థికి సంబంధించిన విషయంలో అన్నదమ్ములతో గొడవలు జరుగుతాయి.  పెద్దల సలహాలు, సూచనలతో వ్యాపార సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. మొదలుపెట్టిన పనుల్లో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులకు చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. కుటుంబంతో దైవ దర్శనం చేసుకోవడం మంచిది. 
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- వ్యాపారానికి సంబంధించిన మీ ఆలోచనలు తప్పని నిరూపించబడతాయి.  ఇంట్లో వారితో చిన్న విషయానికి వివాదాలు వస్తాయి.  నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- నూనత వస్తు, వాహనాలను కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. మొదలుపెట్టిన పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-రాజకీయాల్లో ఉన్నవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారాలు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. మిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యం చేయాలనే ఆలోచన ఉంటుంది.  బంధుమిత్రులతో ఒక పాత విషయం గురించి మాట్లాడుతారు. తలపెట్టిన కార్యక్రమం సకాలంలో పూర్తి చేస్తారు.

Latest Videos

click me!