పాము కాటు వేసినట్టు కల పడితే.. అర్థమేంటో తెలుసా?

First Published | Jul 11, 2024, 3:00 PM IST

చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కొందరికైతే ఏకంగా పాము కరిచినట్టు కూడా కల పడుతుంటుంది. ఇంకేముంది ఉలిక్కిపడి నిద్రలేస్తారు. అయితే ఇలాంటి కల పడితే అర్థమేంటో తెలుసా?
 

పాములంటే ప్రతి ఒక్కరికీ భయమే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పాము కాటుకు గురై చనిపోతున్నారు. అయితే చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. వామ్మో కలలో పాము కనిపించిందని తెగ భయపడిపోతుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. కలల్లో పాము కనిపించడం ఎన్నో సూచనలను ఇస్తుంది. ఇది జరగబోయే సంఘటన గురించి హెచ్చరిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. కొంతమందికి ఏకంగా పాము కాటు వేసినట్టు కూడా కల పడుతుంది. మరి కలలో పాము కాటు వేయడం శుభమా లేదా అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కలలో పాము కాటు

కొందరి జ్యోతిష్యుల ప్రకారం.. కలలో పాము కాటు వేసినట్టు కనిపించడం అశుభం. ఇది మీకు హెచ్చరిక అవుతుందని నమ్ముతారు. అంటే రాబోయే రొజుల్లో మీకు ఏదో ఒక చెడు జరగబోతోందని ఇది సూచిస్తుంది. ఇలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలంటారు జ్యోతిష్యులు.


జీవితంలో మార్పులు 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కలలో మిమ్మల్ని పాము కాటు వేస్తే.. అది మీ జీవితంలో రాబోయే మార్పునకు సంకేతం కావొచ్చు. మీకు ఏదైనా ఏదైనా భావోద్వేగ సమస్యలో చిక్కుకుంటే దానిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.

snakes

ద్రోహానికి గురికావడం 

కలలో పాము కాటు వేయడం ఎన్నింటికో సంకేతమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కలలో పాము కాటు కూడా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయబోతున్నారని సూచిస్తుంది. అందుకే ఇలాంటి కలలు పడ్డప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. 
 

జీవితం కొత్తగా ప్రారంభం 

కలలో మీరు పాము కాటుకు గురైతే.. అది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కూడా కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు. ఈ కల ఒక వ్యక్తిని ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం వైపు ప్రేరేపిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
 

చేతికి పాము కాటు 

కలలో మీ చేతిని పాము కాటేసినట్టైతే.. ఈ కల  ఒక చెడు సమస్య నుంచి బయటపడటంలో ఇబ్బందికి సంకేతం కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు. అందుకే ఈ కల పడ్డప్పుడు డు మిమ్మల్ని మీరు మానసికంగా సురక్షితంగా ఉంచుకోండి.

తలపై పాము కాటు 

కలలో పాము మీ తలపై కాటు వేయడం చూస్తే మీలోని లోపాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాన్ని అంగీకరించి మీరు ముందుకు సాగాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇకపోతే కలలో పాము కనిపించడమంటే మీరు ఆందోళనలో ఉన్నారని అర్థం. అందుకే మీకు ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. 

Latest Videos

click me!