కలలో బంగారం కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?

First Published | Feb 10, 2024, 10:03 AM IST

ప్రతి రోజూ నిద్రలో ఎన్నో కలలు పడుతుంటాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకమైన కలలుగంటుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కల మన భవిష్యత్తు గురించి శుభం లేదా అశుభ సంకేతాలను ఇస్తుంది. మరి మన కలలో బంగారం లేదా బంగారు ఆభరణాలకు సంబంధించిన కలలు పడితే అర్థమేంటో తెలుసుకుందాం పదండి. 

ఆడవారికి బంగారమంటే చాలా ఇష్టం. అందుకే డబ్బులుంటే చాలు బంగారు నగలను కొనేస్తుంటారు. కొంతమందికి బంగారంపై ఉన్న ఇష్టం.. కలలో బంగారం కనిపించేలా చేస్తుంది. మీకు తెలుసా? కలలో బంగారం లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. కలలు మనకు ఎన్నో శుభకరమైన లేదా అశుభ సంకేతాలను ఇస్తాయి. మనం కనే కలలు కూడా మన మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కలలు మన భవిష్యత్తుతో ఏదో ఒక విధమైన సంబంధం కలిగి ఉంటాయని కలల శాస్త్రంలో నమ్ముతారు. అందుకే బంగారానికి సంబంధించిన కలల గురించి డ్రీమ్ సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బోలెడన్ని నగలు చూసినప్పుడు..

మీరు కలలో బంగారంతో చేసిన ఆభరణాలు చాలా చూసినట్టైతే .. మీరు భవిష్యత్తులో చాలా డబ్బు ఖర్చు చేయబోతున్నారని అర్థం వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు చాలా తెలివిగా ఖర్చు చేయాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
 


నగల చోరీ..

కలలో బంగారు  ఆభరణాలను దొంగిలించబడటాన్ని చూసినట్టైతే మంచిది కాదు. ఎందుకంటే ఇది అశుభ కలగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల పడితే మీరు వ్యాపారంలో నష్టపోవచ్చు. లేదా మీ సహోద్యోగుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 
 

బంగారం కింద పడితే..

మీ కలలో నేలపై పడిన బంగారాన్ని తీసుకుంటున్నట్టు కల పడితే మంచిది కాదు. ఎందుకంటే ఈ కల మీరు రాబోయే కాలంలో వరి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అర్థం. అలాగే ఈ సమయంలో కలలో బంగారు నగలను పోగొట్టుకోవడం కూడా శుభప్రదంగా భావించరు. దీని అర్థం మీరు భవిష్యత్తులో డబ్బు కోల్పోవచ్చు.
 


ఏ కల శుభప్రదం?

మీరు కలలో బంగారు ఆభరణాలను కొనడం చూసినట్టైతే.. ఈ కల శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీరు భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే ఒక వ్యక్తికి కలలో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తే అది కూడా శుభ కలగానే పరిగణించబడుతుంది. దీని అర్థం మీరు కెరీర్ లో విజయాన్ని పొందొచ్చు.
 

Latest Videos

click me!