Today Horoscope: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది

First Published Jun 10, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

10-6-2024 సోమవారం  మీ రాశి ఫలాలు 


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్న నాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.  వ్యాపారులు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఉద్యోగులకు పురోగతిని సాధిస్తారు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలహాలు వస్తాయి. ఇది మీకు చిరాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా ఉంటాయి. పనులు నత్త నడకన సాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేయాల్సి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో గొడవలు పడతారు. 

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. సన్నిహితుల సలహా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉండటంతో డబ్బుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారం ఆశించిన విధంగా ఉండదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో మీ పరిచయాలు విస్తరిస్తాయి. ఇది మీకు లాభాదాయకంగా ఉంటుంది. భూమికి సంబంధించిన క్రయ, విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఒత్తిడి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయదు. ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వ్యాపారం విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లోనే కాదు బయట కూడా కొందరి ప్రవర్తన వింతగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. స్నేహితులకు పుణ్యక్షేత్రాలకు వెళతారు. 
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-సమస్యలు వివాదాలు పరిష్కారం అవును.కీలకమైన నిర్ణయాలు లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.నూతన విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు.
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఇంటికి చిన్ననాటి స్నేహితుల రాకతో కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో గొడవలు ఒకరి వల్ల సర్దుమనుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు కొత్త సమాచారం తెలుసుకుంటారు. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరియాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇన్నాళ్లుగా దేనికోసమైతే ఎదురుచూస్తున్నారో అది నిరుద్యోగుల చెంతకు చేరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలకు వెళతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు ఎప్పటిలాగే నిరుత్సాహ పడతారు. 
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-బంధుమిత్రులతో గొడవలు అవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వెనకా ముందు ఆలోచించండి. చేపట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు.వ్యాపారంలో కొన్ని విషయాల్లో ఉన్నపాటుగా నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఉద్యోగులు ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. బంధుమిత్రులతో మీ అనుబంధం పెరుగుతుంది. సోదరుల నుంచి  ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు.

click me!