Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మంచి ఖర్చు చేయాల్సి వస్తుంది

Published : Jul 10, 2024, 05:30 AM IST

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

PREV
112
Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మంచి ఖర్చు చేయాల్సి వస్తుంది
telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. పిల్లల చదువు విషయంలో నిరాశ చెందుతారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లితరఫు బంధువులతో అనుకోని గొడవలు అవుతాయి.  ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. 

212
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-విలువైన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. అన్నదమ్ముల నుంచి అవసరానికి సహాయం పొందుతారు.  ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ఆనందంగా ఉంటారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల్లో కొనసాగుతాయి. నూతన వాహనం కొనే సూచన ఉంది. 

312
telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతారు. తొందరపడి ఇతరులను మాటలు అనకండి. కొన్ని విషయాల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. కొత్త అప్పులు చేయకపోవడమే మంచిది. 
 

412
telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- కుటుంబం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. మొదలుపెట్టిన పనులు అనుకోకుండా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారులు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. 

512
telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారులు ఎంత కష్టపడ్డా .. సరైన గుర్తింపు మాత్రం పొందరు.  ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగులు అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. ఇంట్లో కొందరి ప్రవర్తన వింతగా ఉంటుంది. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

612
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబ సభ్యులు మీకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. వారి సహాయ, సహకారాలతో ఎన్నో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.  నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. 

712
telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-మొదలుపెట్టిన పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత అప్పులను తీర్చేస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. 

812
telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-పిల్లల చదువు విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

912
telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- మానసిక, శారీరక సమస్యలతో బాధపడతారు. ఇతరులపై మీకు ఉన్న అభిప్రాయం తప్పని నిరూపించబడుతుంది.  ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో గొడవలు వస్తాయి. వృత్తి ఉద్యోగులు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. 
 

1012
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-డబ్బు విషయంలో మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.  బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు తమ పనిని పూర్తి చేస్తారు. అకస్మత్తుగా ప్రయాణం చేయొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. 

1112
telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. దీంతో పనులు ముందుకు సాగవు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో ఆనందంగా ఉంటారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. 
 

1212
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- చేపట్టిన కార్యక్రమం సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయాన్ని పొందుతారు. సమాజంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మానసిక ఆనందం కలుగుతుంది.బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories