Today Horoscope: ఓ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

First Published | Jul 8, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు. ఇంటి వాతావరణం చిరాకు కలిగిస్తుంది. ఉద్యోగులు అధికారులతో మాట పడాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం బాగుంటుంది. ఉద్యోగులు ఆనందంగా గడుపుతారు. 


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-బంధువుల నుంచి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకుంటారు. కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. ఆదాయం తగ్గుతుంది. ఇంట్లో శుభకార్యాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు బాగా కష్టపడాల్సి వస్తుంది. 
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంట్లో అనుబంధం పెరుగుతుంది. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ఎలాగోలా పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. వ్యాపారులు మంచి పెట్టుబడులు పొందుతారు. వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. 
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-చిన్ననాటి మిత్రులతో ఒక విషయంలో గొడవలు అవుతాయి. వృత్తి వ్యాపారాలు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చేతిలో నిలవక ఇబ్బంది పడతారు. వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు చేజార్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-దూర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్థి కొనుగోలు విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అవసరానికి బంధుమిత్రుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. వ్యాపారాలు మంచి నిర్ణయం తీసుకుంటే లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఉన్న పని ఒత్తిడి తొలగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. సంఘంలో మీ కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో ఇతరుల సలహాలు, సూచనలు పాటించకపోవడమే మంచిది. ఉద్యోగులు  ఆనందంగా ఉంటారు. 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఇంట్లో అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగాఉండాలి. దైవ అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. కొత్త అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగులు తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతారు.  వాహనం నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతాయి. 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఒకరి జోక్యంతో ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యగులు సమర్థవంతంగా తమ పనిని పూర్తి చేస్తారు. 
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు కష్టానికి తగ్గ గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను నెరవేర్చాలి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధపెడతారు. అకస్మత్తుగా ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. 

Latest Videos

click me!