Today astrology : 26 అక్టోబర్ 2021 మంగళవారం రాశిఫలాలు

Published : Oct 26, 2021, 07:23 AM IST

ఈ రోజు  ఈ రాశి వారికి విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. పనులలో విజయం సాధ్యమవుతుంది. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. 

PREV
113
Today astrology : 26 అక్టోబర్ 2021 మంగళవారం రాశిఫలాలు
Representative Image: Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

213
Representative Image: Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313
Representative Image: Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413
Representative Image: Cancer zodiac

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513
Representative Image: Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613
Virgo

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713
Representative Image: Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813
Representative Image: Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. విందువినోదాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913
Representative Image: Sagittarius

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విచిత్రమైన సంఘటనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013
Representative Image: Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113
Representative Image: Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213
Pices

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
Dr. M.N.Charya

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

Read more Photos on
click me!

Recommended Stories