అదేంటో.., ఈ రాశివారికి కౌగిలింతే చేదు..!

Published : Oct 22, 2021, 10:58 AM IST

ప్రపంచంలోని అత్యుత్తమ భావాల్లో ఈ కౌగిలింత ఒకటి. అలాంటిది.. కొందరికి అసలు కౌగిలింతే నచ్చదు. ఎవరైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నా.. దూరంగా జరిగిపోతుంటారు. 

PREV
16
అదేంటో.., ఈ రాశివారికి కౌగిలింతే చేదు..!

కౌగిలింత.. ఎంతో హాయిని ఇస్తుంది. మనకు ఎదుటివారిపై ప్రేమ ఉందనే విషయం ఈ కౌగిలింతతోనే తెలుస్తోంది. ఎన్నో  పదాలతో చెప్పలేని విషయాన్ని ఒక్క కౌగిలింతతో చెప్పేయవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ భావాల్లో ఈ కౌగిలింత ఒకటి. అలాంటిది.. కొందరికి అసలు కౌగిలింతే నచ్చదు. ఎవరైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నా.. దూరంగా జరిగిపోతుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటివారెవరో చెప్పేయవచ్చట. మరి ఆ రాశులేంటో చూద్దామా..

26

కుంభ రాశి..

ఈ రాశివారు  చాలా రొమాంటిక్. తమ పార్ట్ నర్ తో చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ.. అదేంటో వీరికి కౌగిలింత పెద్దగా నచ్చదు. భర్త సడెన్ గా వచ్చి హత్తుకున్నా దూరంగా జరుగుతారు. తమదంటూ పర్సనల్ స్పేస్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. వారికి వారు ఒక సొంత బబుల్ ఏర్పాటు చేసుకొని.. అందులోనే ఉండిపోవాలని అనుకుంటూ ఉంటారు. భాగస్వామితో నిద్రించేటప్పుడు కూడా వెచ్చని కౌగిలింత వీరికి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది.

36

కన్య రాశి..

ఈ రాశివారు తమకు ఎదుటివారిపై ఉన్న ప్రేమ, అభిమానాలను ఎన్నో రకాలుగా వ్యక్తం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ.. కౌగిలింత ద్వారా చెప్పడం మాత్రం వీరికి పెద్దగా నచ్చదు. వారి భాగస్వామి కష్టాల్లో ఉంటే సహాయం చేయడం.. ఇలా ఎన్నో రకాలు వారికి మద్దతుగా నిలుస్తారు. కానీ హగ్ మాత్రం వీరికి నచ్చదు. విదేశీ సంస్కృతిగా భావిస్తూ ఉంటారు.

46

మిథున రాశి..
ఈ రాశివారు అంత తొందరగా ఎవరికీ హగ్స్ ఇవ్వరు. శరీరాలు తాకేలా హగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మానసికంగా కనెక్ట్ అయితే చాలు అని భావిస్తూ ఉంటారు. వీరికి కేవలం చేతులు పట్టుకోవడం మాత్రమే ఇష్టం. వీరు తమ పార్ట్ నర్ ని హగ్ చేసుకోవాలన్నా..  చాలా సమయం తీసుకుంటారు.

56

ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ.. హగ్ చేసుకోవడాన్ని మాత్రం పెద్దగా ఇష్టపడరు. వీరు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటారు. కౌగిలింత ఆసక్తి ఉండదు కానీ.. పార్ట్ నర్ తో కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పడం వీరికి బాగా ఇష్టం.

66

మకర రాశి..

ఈ రాశివారికి కౌగిలింత పెద్దగా నచ్చదు. పార్ట్ నర్ బలవంత పెడితే.. ఏదో అలా ఇచ్చామా అన్నట్లు ఇచ్చేస్తారు.  అయితే.. వీరికి పార్ట్ నర్ తో కలిసి  షికార్లు, పర్యటనలు చేయడం వీరికి బాగా ఇష్టం. ముద్దు ద్వారా ప్రేమను తెలియజేస్తారు. కానీ.. ఎందుకో కౌగిలింతను మాత్రం పెద్దగా ఇష్టపడరు.

click me!

Recommended Stories