పంచాంగం:
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత ఋతువు
పక్షం: శుక్లపక్షమ
వారము: మంగళవారం
తిథి : త్రయోదశి ఉదయం 6:41 ని వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం : భరణి ఉదయం 9:15 ని వరకు
వర్జ్యం: రాత్రి 9:45 ల11. 26 ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.32ని. ల ఉ.09.16ని. వరకు తిరిగి రా.10.32ని. ల రా.11.24ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.12ని.లకు
సూర్యాస్తమయం: సా.05.21ని.లకు
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఓం నమో నారాయణాయ అను నామాన్ని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోదయోగల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఓం వరలక్ష్మియై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఓం మహాలక్ష్మియైనమః అని 11 సార్లు జపించండి మంచి శుభ ఫలితాలను పొందండి
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఓం మహేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది. సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మిత్రాయ నమఃఓం అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు మీరు ఓం శివాయ నమః అనే 11 సార్లు జపించండిశుభఫలితాలు పొందండి
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చెడు వార్తల వలన మనసు నందు బాధ కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఓం దుర్గాయై నమః అని 11 సార్లు జపించండి సహాశుభ ఫలితాలను పొందండి
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభవార్తలు వింటారు . నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అగును . ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల యొక్క సహాయ సహకారములు లభించును . ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది . ప్రయాణాలు . ఉద్యోగము నందు పై అధికారుల మన్నన పొందుతారు ఓం జగన్నాధాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఓం భార్గవాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సమాజము నందు అపవాదములు. తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఓం శంభవే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. చెడు స్నేహితులను దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అనే పదకొండు సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి