ధనస్సు రాశి తండ్రులు.. పిల్లలతో ఎలా ఉంటారో తెలుసా?

Published : Dec 05, 2022, 03:58 PM IST

తండ్రి ఎలా ఉండాలి అనే విషయం ఈ రాశికి చెందిన వారిని చూసి నేర్చుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా... తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తారు.  

PREV
17
ధనస్సు రాశి తండ్రులు.. పిల్లలతో ఎలా ఉంటారో తెలుసా?

ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం వారు తాపత్రయపడుతూ ఉంటారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం.... ధనస్సు రాశి తండ్రులు... తమ పిల్లలతో ఎలా ఉంటారు..? వారితో ఎలా ప్రవర్తిస్తారో ఓసారి  చూద్దాం...
 

27

ధనస్సు రాశికి చెందిన పురుషులు.. తమ పిల్లల విషయంలో తండ్రి పాత్రకు 100శాతం న్యాయం చేస్తారు. తండ్రి ఎలా ఉండాలి అనే విషయం ఈ రాశికి చెందిన వారిని చూసి నేర్చుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా... తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తారు.

37
Sagittarius Zodiac

అలా అని పిల్లలతో ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు అనుకోవడం పొరపాటు. వీరు తమ పిల్లలతో చాలా సరదాగా ఉంటారు. పిల్లలతో గడిపినప్పుడు వారు కూడా పిల్లల్లానే ప్రవర్తిస్తారు. చాలా ఫన్ గా.. పిల్లలను ఎక్కువగా ఆనందంగా ఉంచడంలో ముందుంటారు.

47

తమ పిల్లలు మరీ పసి పిల్లలుగా అంటే సంవత్సరంలోపు పిల్లలతో వీరు అంత కంఫర్ట్ గా ఉండలేరు. కానీ... పిల్లలు కొంచెం పెద్దైన తర్వాత.. అంటే... రెండు, మూడేళ్లు వచ్చినప్పటి నుంచి వారి ప్రతి పనినీ వీరే చూసుకుంటారు.
 

57

పిల్లలతో సరదాగా ఉంటారు. కానీ... సీరియస్ సందర్భాల్లో మాత్రం అంతే సీరియస్ గా ఉంటారు. పిల్లలకు సీరియస్ విషయాలు చెప్పే సందర్భంలో అలానే ప్రవర్తిసతారు. ఆ సమయంలో సరదా చేయరు.

67

తమ పిల్లల భవిష్యత్తు బాగుండేందుకు పిల్లలకు ప్రతిదీ నేర్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. మంచి టీచర్ గా మారి ... వారికి అన్ని విషయాలు నేర్పిస్తారు.
 

77
Sagittarius Zodiac

ధనస్సు రాశికి చెందిన తండ్రులు.... తమ పిల్లల ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్సడ్ గా ఉంటారు. తమ పిల్లలు చేస్తున్న పనులు చూసి మురిసిపోతూ ఉంటారు. తమ పిల్లలు, కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లేందుకు, కొత్త ప్రపంచాన్ని చూసేందుకు వారు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు.

click me!

Recommended Stories