Today Horoscope: ఓ రాశి వారు రుణాలు తీరి మానసిక ప్రశాంతత

First Published Aug 3, 2022, 3:57 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు. సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. 

astrology

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

astrology

పంచాంగం :

 సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్షఋతువు
వారమ: బుధవారం
పక్షం : శుక్లపక్షము
తిథి : షష్ఠి రా.01.51ని.  వరకు
నక్షత్రం : హస్త సా.04.07ని. వరకు
వర్జ్యం : రా.12.05ని. నుండి రా.01.40ని. వరకు
దుర్ముహూర్తం :ప. 11.39ని. నుండి మ. 12.31ని. వరకు.       
పితృ తిథి: షష్ఠి
రాహుకాలం:మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం:  ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:42ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:29ని.ల వరకు.     
  

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలలో లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం.
 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగి ఉపశమనం పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు. సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం . కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
బంధుమిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు.పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.  విద్యార్థులకు అనుకూలం.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన  పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు సామాన్యం.
 

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
తలపెట్టిన పనులలో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడినచికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు.  వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రుణ బాధల నుండి కొంతవరకు బయటపడతారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య వాహన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.
 

click me!