Zodiac sign: పరీక్షల ఒత్తిడిని పిల్లలు ఎలా తట్టుకుంటారు..?

First Published Aug 2, 2022, 1:25 PM IST

నిజంగానే పరీక్షలు ఎలాంటి వారికైనా ఒత్తిడిని తీసుకువస్తాయి. మరి అలాంటి ఒత్తిడిని ఏ రాశి పిల్లలు ఎలా అధిగమిస్తారో.. జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.

exam result

పరీక్షలు అనగానే మనం వెంటనే ఒత్తిడి, టెన్షన్ వచ్చేస్తూ ఉంటాయి.  ముఖ్యంగా పిల్లలు అయితే.. భయంతో వణికిపోతారు. పరీక్షలు ఎలా తప్పించుకోవాలా అని చూసే పిల్లలు కూడా ఉంటారు. నిజంగానే పరీక్షలు ఎలాంటి వారికైనా ఒత్తిడిని తీసుకువస్తాయి. మరి అలాంటి ఒత్తిడిని ఏ రాశి పిల్లలు ఎలా అధిగమిస్తారో.. జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.

1.మేష రాశి..
మేష రాశివారి లో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఈ రాశివారు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే సత్తా వీరిలో ఉంటుంది. ఈ రాశికి చెందిన పిల్లలు పరీక్షలన్నా.. భయపడరు. ఒకవేళ ఎదైనా ఒత్తిడి కలిగినా... దానిని అదిగమించడానికి ప్రయత్నిస్తారు. కానీ టెన్షన్ తో సమస్యను మరింత పెద్దది చేసుకోరు.

2.వృషభ రాశి..
వృషభ రాశివారు పరీక్షల పేరు వినపడగానే వారిలో వారు అభద్రతా భావం పెంచేసుకుంటారు.  అయితే.. ఎంత ఒత్తిడి ఉన్నా వీరు భయటపడరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి ప్లాన్ తో ముందుకు వచ్చి.. ఒత్తిడిని అధిగమిస్తారు.
 

3.మిథున రాశి..
మిథున రాశికి చెందిన పిల్లలు పరీక్షలు రాగానే.. నెర్వస్ ఫీలౌతారు. అయితే.. ఆ ఒత్తిడి నుంచి భయటపడటానికి వీరు.. ఇతరులతో మాట్లాడటం, ఎవరినుంచైనా సలహాలు తీసుకోవడం లాంటివి చేస్తారు.

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు పరీక్షలు అనే పేరు ఎత్తగానే భయపడిపోతూ ఉంటారు. అయితే.. ఆ భయం నుంచి బయటపడటానికీ వీరు చాలా కష్టపడిపోతూ ఉంటారు. అయితే...  పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి... తమకు ఇష్టమైన వారితో మాట్లాడి.. శక్తిని పెంచుకుంటారు.
 

5.సింహ రాశి...
సింహ రాశివారు చాలా సరదాగా ఉంటారు. వీరు చాలా చార్మింగ్ గా ఉంటారు. ఈ రాశికి చెందిన పిల్లలు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు. వీరికి పరీక్షల ఒత్తిడి పెద్దగా ఉండదు. వారు ఫోకస్ తో తమ టెన్షన్ ని తగ్గించుకునే ప్యత్నం చేస్తారు.
 

6.కన్య రాశి..
చాలా పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప.. ఈ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేమని వీరు ఫీలౌతారు.  ఈ రాశివారి లక్ష్యం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి.. వీరికి పరీక్షల ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పరీక్షల్లో విజయం సాధించేందుకు బద్దకాన్ని పక్కన పెట్టేస్తారు.
 

7.తుల రాశి...
తుల రాశివారు ఎలాంటి పరిస్థితిలోనూ ఒత్తిడికి గురవ్వలేరు. కానీ తుల రాశికి చెందిన చిన్న పిల్లలు కాస్త పరీక్షలంటే భయపడుతుంటారు. కాబట్టి.. ఆ సయమంలోనూ ఒత్తిడి తగ్గించుకోవడానికి.., స్నేహితులతో గ్రూప్ డిస్కషన్స్ లాంటివి చేస్తూ ఉంటారు. ఈ డిస్కషన్స్ లో వారు తమ ఆలోచనలు పంచుకొని.. పరీక్షల భయం నుంచి భయటపడతారు.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు.. పరీక్షల ఒత్తిడి నుంచి భయపడటానికి.. చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఎవరితోనూ మాట్లాడటం లాంటవి చేయరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
 

9. ధనస్సు రాశి..
ధనస్సు రాశి పిల్లలు.. చదువు విషయంలో చాలా టాప్ గా ఉంటారు. బాగా చదువుతారు. దీంతో.. వాళ్లకు పరీక్షల ఒత్తిడి పెద్దగా ఉండదు. ఒక వేళ ఒత్తిడి కలిగినా.. స్నేహితులతో కాసేపు గడిపి ఒత్తిడిని అధిగమిస్తారు.
 

10.మకర రాశి..
మకర రాశికి చెందిన పిల్లలు.. పరీక్షల ఒత్తిడి పెద్దగా ఉండదు. వీళ్లు టెన్షన్ పడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిప్పుడు వారు తమ కంట్రోల్ తామే తప్పినట్లుగా భావిస్తారు. ఆ కంట్రోల్ మళ్లీ తెచ్చుకోవడానికి వీరు.... చాలా ఎక్కువగా పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెడతారు. చదివిన వాటినే మళ్లీ చదవడం మొదలుపెడతారు.

11.కుంభ రాశి...
కుంభ రాశివారు ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు పరీక్షలు అనగానే ఎక్కువగా ఆలోచించి మరింత ఒత్తిడి కి గురౌతూ ఉంటారు. అయితే.. వీరు కాన్ఫిడెన్స్ తెచ్చుుకొని.. మళ్లీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు.
 

12.మీన రాశి...
మీన రాశి పిల్లలు.. పరీక్షలు అనగానే మామూలుగానే ఒత్తిడికి గురౌతూ ఉంటారు. ఈ రాశివారు.. తమ అలవాట్లతో ఒత్తిడిని అధిగమించాలని చూస్తూంటారు. ఆతర్వాత ఒత్తిడి తగ్గిన వెంటనే.. మళ్లీ చదువుపై ఫోకస్ పెడతారు.

click me!