Daily Horoscope 2022 - 23
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. వ్యాపారబలం పెరుగుతుంది. ధనలాభం ఉంది. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకుంటారు. దేనికీ తొందరవద్దు. మనోబలంతో ముందుకుసాగండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. మీ ప్రతిపాదనలు బంధువులు ఆమోదిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా సాగుతాయి.స్థిరాస్థి వృద్ధి చేస్తారు. అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
చేయు పనులయందు ఆటంకాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఎక్కువగా కష్టపడతారు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
అధికారుల ఒత్తిడి. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
అనవసరమైన గొడవలు. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. తెరాస క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
దేవాలయ సందర్శన. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు.
పంచాగం
28 మే 2022 శనివారం
శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
కృష్ణపక్షం
త్రయోదశి మ.01:19ని.ల వరకు
భరణి నక్షత్రం రా.తె 04:43ని|| వరకు
వర్జ్యం మ.01:30ని.ల లగాయతు మ.03:11ని.లవరకు
దుర్ముహూర్తం ఉ. 05:29ని. లగాయతు ఉ.07:12ని.ల వరకు
రాహుకాలం ఉ. 09:00ని.ల లగాయతు ఉ. 10:30ని.ల వరకు
యమగండం మ. 01:30ని.ల లగాయతు మ.03:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:29ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:25ని.లకు.