Today Horoscope: ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు..

Published : Jul 17, 2022, 04:30 AM IST

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.  

PREV
113
Today Horoscope: ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు..
Aries Zodiac

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 

విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 

213
Taurus Zodiac

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. సోదరులతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.
 

313
Gemini Zodiac

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

పనులలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు.ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.

413
Cancer Zodiac

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభకార్యాలలో  పాల్గొంటారు. పెట్టుబడులలో స్వల్ప లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. సాంకేతిక విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి.
 

513
Leo Zodiac

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. ఇతరుల విషయంలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి.దేవాలయ సందర్శన. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.పనుల యందు నిరాసక్తత.   నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

613
Virgo Zodiac

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.సంఘంలో ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.గృహంలో అనుకూలమైన వాతావరణం. ముఖ్యమైన పనులను సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.  దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.
 

713
Libra Zodiac

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శారీరక శ్రమ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను.  వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.
 

813
Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

దీర్ఘకాలిక రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారం యొక్క అభివృద్ధి. కొత్త పనులను చేపట్టి నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.
 

913
Sagittarius Zodiac

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు. పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి.మానసిక ప్రశాంతత. గృహ నిర్మాణ ఆలోచనలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో లాభాలు.
 

1013
Capricorn Zodiac

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.  విద్యార్థులకు అనుకూలం. స్నేహితుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి.

1113
Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. రుణ శత్రుబాధలు. గృహ నిర్మాణ కార్యక్రమాలకు సరైన సమయం కాదు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

పంచాంగం :

సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాడం
ఋతువు : గ్రీష్మఋతువు
వారమ: ఆదివారం
పక్షం : కృష్ణపక్షము
తిథి : బ.చవితి మ.03.50ని.  వరకు
నక్షత్రం : శతభిషం రా.06.58ని. వరకు
వర్జ్యం : రా.01.11ని. నుండి  రా.02.44ని. వరకు 
దుర్ముహూర్తం : సా.04.50ని. నుండి సా.5.42ని. వరకు 
పితృ తిథి: చవితి 
రాహుకాలం: మ 4.30ని నుండి 6.00ని వరకు
యమగండం: మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:37ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:34ని.ల వరకు.     
దక్షిణాయణం ప్రారంభం
 

Read more Photos on
click me!

Recommended Stories