ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆప్తుల నుండి కీలక సమాచారం

Published : Apr 17, 2023, 05:40 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి వారికి ఈ రోజు   చిన్నపాటి సమస్యలు పరిష్కారమగును. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. 

PREV
113
  ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆప్తుల నుండి కీలక సమాచారం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:        
తేది : 17ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :-    కృష్ణపక్షం                                                                                   
వారము: సోమవారం
తిథి :-  ద్వాదశి మధ్యాహ్నం 2:57 ని.వరకు
నక్షత్రం:-  పూ.భా రాత్రి 1:59ని.వరకు
యోగం:- బ్రహ్మం రాత్రి 8.43 ని.వరకు
కరణం:- తైతుల ప॥2.57 గరజి రాత్రి 1.55 ని.వరకు
అమృత ఘడియలు:- సాయంత్రం 6:26 ని.ల 7:56 ని.వరకు
వర్జ్యం:- ఉ.9:23 ని.ల 10:53
దుర్ముహూర్తం:మ.12.23ని. నుండి మ.01.13ని. వరకు తిరిగి మ.02.52ని. నుండి మ.03.42ని. వరకు
రాహుకాలం:మ.01.30ని నుండి మ.03.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలెను. కుటుంబం నందు తొందరపాటు నిర్ణయాల వలన మానసిక ఆందోళన చెందుతారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. శారీరక శ్రమతో ఎలాంటి  కార్యాన్నైనా సాధించగలరు. వృత్తి ఉద్యోగాల యందు ఒడిదుడుకులు గా ఉండును ‌. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది ఏర్పడగలరు. ఉద్యోగమునందు మీ విధిని సక్రమంగా నిర్వహించగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఉద్యోగము నందు ఉన్నత కలుగుతుంది. గృహమునందు సంతోషకరమైన వాతావరణం. వ్యాపారం నందు భాగస్వామ్యులు కలిసి వస్తారు. వృత్తి వ్యాపారంలో విజయవంతంగా సాగుతాయి. చిన్నపాటి సమస్యలు పరిష్కారమగును. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
సమాజం నందు గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. మనసునందు ప్రశాంతంగా ఉండును. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం రామచంద్రాయ నమః అని జపించండి.

513
telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

వృత్తి వ్యాపారం నందు అభివృద్ధి సంబంధించిన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతోటి తో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం పొందగలరు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. ఈ రాశి వారు ఈ రోజు కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభవార్తలు వింటారు.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సమాజం నందు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. బంధువర్గముతోటి సహాయ సహకారాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేరు. అనవసరమైన గొడవలు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి చిన్న విషయం భయంగా ఉంటుంది. సమాజము నందు గౌరవ మర్యాదలు నశిస్తాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. చేయ పని యందు అలసట ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. బంధుమిత్రులతో విరోధాలు రాగలవు. ఉద్యోగం నందు అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మానసిక ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపారంలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రయత్నించి న పనులు వృధా అగును . ఉద్యోగమునందు అధికారులచే ఒత్తుడులు ఏర్పడగలవు. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం ఏర్పడను. పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఆ కారణంగా కలహాలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ప్రతి పని పట్టుదలతోటి ధైర్యంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. కానీ సామాన్య ఫలితం పొందగలరు. మనసు చంచలంగా ఉండును. ఉద్యోగం నందు అనుకోని అవాంతరాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఏర్పడగలవు. రాజకీయ వ్యవహారములు అనుకూలించెను. 

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు రాగలవు. కుటుంబం నందు అశాంతి వాతావరణ ఏర్పడగలదు. బంధుమిత్రుల తోటి అకారణంగా కలహాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. భార్య పుత్రుల తోటి కొద్దిపాటి మనస్పర్ధలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొనవలెను. వ్యాపారం నందు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయం నందు జాగ్రత్త అవసరము. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఏర్పడగలవు. తలచిన పనులలో సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోను. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబము నందు ఆనందముకు పరిమితి ఉండదు. ఇతరులకు సేవక లకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి విషయం జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. లాభకరమైన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అన్ని విధాల బాగుంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగమనందు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రుల తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆర్థికంగా అన్న విధాల బాగుండును. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

click me!

Recommended Stories