
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఓర్పు, అంకితభావం ముఖ్యం. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. విందు, వినోదాలలో పరిమితి పాటించడం శ్రేయస్కరం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
గౌరవం. అన్నిపనులకుఅనుకూలం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెలకువ అవసరం.విద్య, ఉద్యోగ, వ్యాపారములయందులాభం. కుటుంబంతో అనందంగాగడుపుతారు. రావలసినబాకీలువసూలగును. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు. బంధు,మిత్రులతో గొడవలు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. బంధువుల కారణాలవల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి.అనవసర ఖర్చు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
కుటుంబంతోఅనందంగాగడుపుతారు. విలాసవంతమైనవస్తువులకోసంఖర్చుచేస్తారు.రవాణా రంగంలోని వారు చికాకులను ఎదుర్కొంటారు. ఏ.సి.కూలర్ మోకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. అనుకున్నపనులనుపూర్తిచేస్తారు. ప్రయాణాలు. కొత్తవ్యక్తులపరిచయాలు. గృహమునందుసుఖవంతంమైనజీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారములయందులాభం. కొత్తఆలోచనలుచేస్తారు. ఓంమహాలక్ష్మియైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
గౌరవం. అన్ని పనులకు అనుకూలం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆర్థికాభివృద్ధి కానవస్తుంది. రావలసిన బాకీలు వసూలగును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళ తప్పవు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. విశ్రాంతి లోపం,విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు. కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
శుభవార్తవింటారు. బంధుమిత్రులనుకలుస్తారు.కుటుంబంతో అనందంగాగడుపుతారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి. గృహోపకరణ వ్యాపారాలు వేగంపుంజుకుంటాయి.ప్రయాణాలు. ఉద్యోగ,వ్యాపారములయందులాభం.గౌరవప్రతిష్ఠలుకల్గును. మంచిపనులనుచేస్తారు.సర్వకార్యసిద్ది. ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
గౌరవం. అన్ని పనులకు అనుకూలం. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థులు ఉన్నత విద్యలలో రాణిస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలగును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు.కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. బంధు,మిత్రులతో గొడవలు. అనవసర ఖర్చు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు. కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
ఈ రోజు పంచాంగం
తేది : 5, మే 2022
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
ఈరోజు ఉదయం 7 గం॥ 10 ని॥ వరకు)
తదుపరి : పంచమి
నక్షత్రం : ఆరుద్ర పూర్తి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 56 ని॥ నుంచి
వర్జ్యం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 58 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 42 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 16 ని॥ లకు
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)