
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 9949459841 (సంప్రదించువారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఏ ప్రయత్నం కలిసిరాక పోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. అకారణంగా కోపం వచ్చును. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
అనవసర గొడవలు. ప్రయాణాలు భయం,నీరసంగా ఉండును. సాహసముతో చేయు పనులతో లాభం చేకూరును. కొత్త సమస్యలు ఏర్పడును.
కొద్దిపాటి అస్వస్థతకు లోనవుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. అనేక రకములైన ఆలోచనలు చేస్తారు. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఒకానొక విషయంలో బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వస్తువులపట్ల ఆపేక్ష అధికమవుతుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అయితే కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
చేయుపనులయందు ఆటంకములు. ఎక్కువకష్టపడతారు. మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. అనవసరఆలోచనలుచేస్తారు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారములయందునిరాశ. గృహ,భూలాభం. కష్టముతోచేయుపనిలోజయముసిద్దించును. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
గౌరవం. అన్నిపనులకుఅనుకూలం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. విద్య, ఉద్యోగ, వ్యాపారములయందులాభం. కుటుంబంతో అనందంగాగడుపుతారు. రావలసినబాకీలువసూలగును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లుజపించవలెను.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. అయితే సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక.వాహన యోగం. ఉద్యోగ, వ్యాపారములయందు నిరాశ. గృహ,భూలాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓంనమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. అకారణంగా కోపం వచ్చును. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
ప్రత్యర్థులు స్నేహ హస్తం అందించినా మీరు దూరం జరుగుతారు. సంగీత, సాహిత్య, సినీ, కళా రంగాలలోని వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ లక్ష్యాన్ని చేరుకొనే విషయంలో మెళుకువలు అవసరం. సాహసముతో చేయు పనులతో లాభం చేయు పనుల యందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. అనవసర ఆలోచనలు చేస్తారు.బద్దకంతో ఏ పని చేయబుద్ది కాదు. గృహ,భూ లాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగాపూర్తి చేస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. అవివాహితులకు అనుకూలమైనకాలం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
చేయుపనులయందుఆటంకములు. ఎక్కువకష్టపడతారు. ముఖ్యుల కలియికను గోప్యంగా ఉంచడం మంచిది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. గృహ,భూలాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఈ రోజు పంచాంగం
తేది : 4, మే 2022
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి పూర్తి
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 8 ని॥ నుంచి
నక్షత్రం : మృగశిర
(నిన్న రాత్రి 1 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3 గం॥ 56 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 16 ని॥ లకు