మీ పిల్లలు బంధువులతో కలవడం లేదా? ఎందుకో తెలుసా...

Published : May 03, 2022, 12:10 PM IST

కొంతమంది పిల్లలు కొత్తవారిని చూస్తే పారిపోతారు. మరికొంతమంది ఎలాంటి కొత్తా, పాతా లేకుండా కలిసిపోతారు. ఇంకొందరు ఎంతమందిలో ఉన్నా సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతారు. అయితే దీనంతటికీ కారణం రాశీచక్రమే అంటున్నారు నిపుణులు. 

PREV
112
మీ పిల్లలు బంధువులతో కలవడం లేదా? ఎందుకో తెలుసా...

మేషరాశి (Aries) : వీరు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. కానీ హాఠాత్తుగా మూడ్ చేంజ్ అవుతుంటుంది. బంధువులు అడిగితే వారిని ఎంటర్ టైన్ చేయడం వారికి ఇష్టమే. కానీ ఒక్కసారి వారికేదైనా తేడా అనిపిస్తే.. ఇక అ అయిష్టాన్నే మెయింటేన్ చేస్తారు. 

212

వృషభరాశి ( Taurus) : ఈ రాశికి చెందిన పిల్లలు రిజర్వ్ డ్ ఉంటారు. అంతర్ముఖులుగా ఉంటారు. వారి అసలైన వ్యక్తిత్వాన్ని అంత తొందరగా బైటికి రానివ్వరు. తమ కంఫర్ట్ జోన్ లో ఉంటారు. అంత తొందరగా వేరే వ్యక్తులను నమ్మరు. 

312

మిధునరాశి ( Gemini) : ఈ రాశిపిల్లలు బంధువులతో భలే కలిసిపోతారు. చక్కగా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. వయసుతో తేడా లేకుండా ఎలాంటి వారినైనా తమ చేతలతో ఆకర్షిస్తారు. 

412

కర్కాటకరాశి ( Cancer) : వీరు మానసికంగా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఓపిక ఎక్కువ.. చుట్టాలతో బంధాలు మెయింటేన్ చేయడంతో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఎవరినీ బాధపెట్టొద్దని చూస్తారు.

512

సింహరాశి (Leo) : ఎక్కడ చూసినా వీరే కనిపిస్తారు. ఈ రాశి పిల్లలు చాలా ఫెయిర్ గా ఉంటారు.. చాలా బోల్డ్, ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. ఈ లక్షణాల వల్లే బంధువులతో సులభంగా కలిసిపోతారు. అంతేకాదు అందరికీ ఫేవరేట్ అవుతారు. 

612

కన్యారాశి ( Virgo) : కన్యారాశి పిల్లలు చాలా తెలివిమంతులు. వీరికి భవిష్యత్తు మీద చిన్నతనంనుంచే ఓ దృష్టి ఉంటుంది. దీనివల్ల ఎంత పెద్దవారినైనా తమ తెలివితో ఆకట్టుకుంటారు. 

712

తులారాశి ( Libra) : ఈ రాశి పిల్లలు శాంతికాముకులు. పరిస్థితుల్ని చక్కగా బాలెన్స్ చేస్తారు. వాదనలు, గొడవలు, పోట్లాటల సమయంలో వీరు వాటిని కూల్ చేయడంలో సిద్ధహస్తులు.

812

వృశ్చికరాశి ( Scorpio) : ఎదుటివ్యక్తిని అంచనా వేయడానికి టైం తీసుకుంటారు. రెగ్యులర్ గా కలవని వారితో వెంటనే కలిసిపోలేరు. కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వారితో సెట్ అయ్యారంటే వారికి బాగా దగ్గరవుతారు. 

912

ధనుస్సురాశి  ( Sagittarius) :  వీరికి సరదాగా ఉండడం అంటే చాలా ఇష్టం. సాహసాలను ఇష్టపడతారు. ఇలాంటి ఇష్టాలున్న బంధువులైతే వెంటనే వారితో కలిసిపోతారు. 

1012

మకరరాశి ( Capricorn) : వీరు బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు చెప్పేది ఏదైనా రీజనబులే అనిపిస్తుంది. వారికి ఎవరిగురించైనా ఏదైనా అనిపిస్తే వెంటనే చెప్పేస్తారు. 

1112

కుంభరాశి (Aquarius) : అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయరు. సృజనాత్మకంగా ఉంటారు. తెలివి వీరి సొంతం. చాలా కుతూహలం ఉంటుంది. 
 

1212

మీనరాశి ( Pisces) : కుటుంబసభ్యుల పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. కమిటెడ్ గా ఉంటారు. కుటుంబసభ్యులా? బంధువులా? అనేది కాదు.. ఏదైనా సమస్య వస్తే తామే ముందుంటారు. 

click me!

Recommended Stories