
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. బిల్డర్లకు కష్టకాలం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం . బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి యోగదాయకమే. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపార లావాదేవీలు కొలిక్కివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
శుభవార్త వింటారు. చేయు వృత్తి వ్యాపారాల యందు ధనలాభం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. గృహము నందు శుభకార్యములు. ఇష్ట దేవతారాధన. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు. స్తంభించిన కార్యములను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. విద్యార్థులకు అనుకూలం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించిన శుభం జరుగును.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహమార్పు అనివార్యం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలాసాలకు అధికంగా ఖర్చు చేస్తారు. ఓం దుర్గాయై నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు మోసగిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
సంఘంలో పేరుప్రతిష్టలు. విద్యావంతులను కలుసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు విపరీతం. దైవదర్శనం. రావలసిన బాకీలు వసూలగును. ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తా శ్రవణం. వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. రోజు భారంగా గడుస్తుంది. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి.పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. నగదు ద్రా చేసేటపుడు జాగ్రత్త. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)