ఈ రాశుల వారితో సింహరాశి వారు ప్రేమలో అదుర్స్...

Published : May 10, 2022, 01:39 PM IST

రాశుల్లో రాజాలాంటిది సింహరాశి ఈ రాశికి ఏ రాశి వారితో ప్రేమకు సరిపోలుతుందో.. ఏ రాశివారితో బాగా కలిసిపోతారో జ్యోతిష్యనిపుణులు ఇలా చెబుతున్నారు.

PREV
113
ఈ రాశుల వారితో సింహరాశి వారు ప్రేమలో అదుర్స్...

అన్ని రాశుల్లో కెల్లా సింహరాశి రాజసం ఉట్టిపడే రాశి. ఈ రాశివారు ధైర్యంతో పాటు అద్భుతమైన సృజనాత్మకతతో ఉంటారు. స్వతంత్రంగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ, సెక్స్ విషయానికి వస్తే ఆధిపత్యం చూపించడానికి ఇష్టపడతారు. సింహరాశివారు ధైర్య-హృదయాలు, వారి విశ్వాసం, ఆశయం, సానుకూల ఆలోచనలు ఆదర్శప్రాయమైనవి. అసమానమైనవి. వీరితో మిగతా రాశుల వారికి ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి..అనే విషయాన్ని ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

213

మేషరాశి వారితో సింహరాశి
ఈ రెండు రాశుల వారు కలిసి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన ప్రణాళిక చేసుకుని బాగా కష్టపడాలి. వీరిద్దరూ మోడలింగ్‌లోకి వెళ్లి మానిఫెస్టేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ రాశుల వారిమధ్య ఉండే అండర్ స్టాండింగ్ వల్ల నరదృష్టి ఉంటుంది. దీనికోసం తెల్లటి దుస్తులు లాంటివి ధరించాలి. వెలుగులో ఎక్కువగా ఉండాలి.ఈ రాశుల వారు మొత్తం మీద, సంతోషంగా, సంతృప్తిగా, జీవితానికి బాధ్యత వహిస్తారు.

మొత్తం : 5
సెక్స్ : 5
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 3

313
Representative Image: Taurus

వృషభరాశితో సింహరాశి
ఆలోచనలు, మనస్సులో తేడాల కారణంగా వీరి మధ్య కొంత గ్యాప్ ఉండొచ్చు. అయితే ధ్యానం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది. ఆలోచనలో మార్పు ముఖ్యంగా పరిమితులను,ప్రతికూలతను అధిగమించడానికి సహాయపడుతుంది. ఓవరాల్ గా మీరు ఒకరి విలువను మరొకరు గుర్తిస్తారు.
మొత్తం : 4
సెక్స్ : 3
ప్రేమ: 4
కమ్యూనికేషన్ : 2

413

మిథునంతో సింహరాశి
ఇద్దరి మధ్య కెమిస్ట్రీలో సానుకూల మార్పు కనిపిస్తుంది. దానిని గుర్తించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు లేదా మీ ఎక్స్ మిమ్మల్ని నిస్సహాయులుగా భావించేలా చేసి.. ఇబ్బంది పెట్టవచ్చు. మిధునరాశివారితో కలవడం వల్ల భావోద్వేగాలు మళ్లీ పుంజుకుంటున్నందున మీ ఫీలింగ్స్ ఏంటో ఎవ్వరినీ నిర్దేశించనివ్వవద్దు. ఈ రెండు రాశుల కలయిక.. ఇద్దరిలోనూ పునరుజ్జీవనానికి దారితీస్ుతుంది. అంతిమంగా మీ శ్రేయస్సు కోసం ప్రయోజనకరంగా ఉంటుంది.

మొత్తం : 4
సెక్స్ : 3
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 3

513

కర్కాటక రాశితో సింహరాశి
వీరిద్దరి జోడీ చాలా బాగుంటుంది. కలిసి చేసే ప్రయాణంలో మంచి రోజులను చూస్తారు. ఒకరికొకరు ఎనర్జీగా ఉంటారు. అందుకే కాసేపు ఇద్దరూ కలిసి సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అప్పుడే మీదైన స్పార్క్ మీ సొంతం అవుతుంది. అందుకే ఒకరినొకరు పాంపరింగ్ చేసుకోవడానికి ఒక రోజును షెడ్యూల్ చేయడం లేదా ఒక రోజు అవుటింగ్ కు వెళ్లడం చేయాలి. 

మొత్తం : 3
సెక్స్ : 4
ప్రేమ : 5
కమ్యూనికేషన్ : 3

613

సింహరాశితో సింహరాశి
కమ్యూనికేషన్ అవసరం. ఆహార, విహారాలు, అలసట గురించి ఒకరికొకరు తెలుపుకోవాల్సిందే. మీ మధ్య ఏది ఆలస్యం అవుతుందో గమనించండి. మీ మధ్య చిన్న గ్యాప్ వచ్చిన ఒక్క కౌగిలితో దాన్ని దూరం చేయచ్చు. 
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3

713
Virgo

కన్యరాశితో సింహరాశి
మీ సంబంధం నీరు లాంటిది. ఏ పరిస్థితికైనా అనుగుణంగా మారిపోతారు. ఒకరినొకరు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఒత్తిడి కలుగుతుంది. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. 
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3

813
Libra

తులారాశితో సింహరాశి
ఒకరితో ఒకరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఒకరి సమక్షంలో మరొకరు సురక్షితంగా ఫీలవుతారు. వీరి సంబంధం సరళంగా ఉంటుంది. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, షాపింగ్ లకు కలిసి వెళ్లడం మీ మధ్య బంధాన్ని మరింత బలపర్చడానికి సహాయపడుతుంది.
మొత్తం : 5
సెక్స్ : 3
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 3

913
Representative Image: Scorpio

వృశ్చికరాశితో సింహరాశి
మీ సమస్య మూలం కోసం బయటకాదు మీలో మీరే వెతుక్కోండి. గాయపడినప్పుడో, బాధపడినప్పుడో ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా సంయమనం పాటించండి. 
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3

1013
ধনু (Sagittarius)

ధనుస్సు రాశితో సింహం
భావోద్వేగంగా కాకుండా ప్రేమతో నిర్ణయాలు తీసుకునేలా ఒకరిమీద ఒకరు  విశ్వాసం పెంచుకోండి. మీరు కలిసినప్పుడు ఒకరి మనసులోని విషయాలు మరొకరు గ్రహించడానికి ప్రయత్నించండి. మొత్తంమీద, ఆత్మ శోధన, విశ్వసనీయ స్నేహితుడి మాట వినడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. 
మొత్తం: 3
సెక్స్: 4
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 3

1113
Capricorn

మకరరాశితో సింహరాశి
మీరు వివిధ ప్రత్యామ్నాయ ఎంపికల తర్వాత కలిసి ఉన్నారు కాబట్టి అసూయతో, ఒకరినొకరు విస్మరించకుండా సమగ్ర విధానాన్ని అనుసరించండి. దేన్నైనా కలిసి ఎదుర్కోనే సత్తా ఉంది కాబట్టి భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక బంధాన్ని బలోపేతం చేసుకోండి. 
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 5

1213
কুম্ভ রাশি (Aquarius)

కుంభరాశితో సింహరాశి
కలిసి, ప్రతికూల భావాలను అధిగమించవచ్చు, ఎందుకంటే కోపం లేదా దుఃఖం మీ మద్య పెద్దగా ఉండవు కాబట్టి.. విషయాలు అదుపు తప్పుతున్నట్లు అనిపించినప్పటికీ, ఆరోగ్యకరమైన క్షణాల కాలానికి దారి తీస్తుంది. మీ ఆరోగ్యాన్ని లేదా మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేయనివ్వవద్దు. 
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 2

1313
Pisces Zodiac

మీన రాశితో సింహరాశి
మీరు ఒక కారణం కోసం ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారు, కాబట్టి ఒకరి సంతోషం కోసం మరొకరు ప్రయత్నించాలి. తాజా పువ్వులు, గదిని ప్రకాశవంతం చేయడం, చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం చేయాలి. వీరు ఒకరికొకరి సహవాసంలో ఓదార్పుని పొందుతారు. ఒకరికొకరు పరిపుష్టిగా వ్యవహరిస్తారు. 
మొత్తం: 5
సెక్స్: 4
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 3

click me!

Recommended Stories