ఇంట్లో సంపద పెరగాలా..? ఈ మార్పులు చేయండి..!

First Published Jun 25, 2022, 4:34 PM IST

ఏవో ఒక ఖర్చులు వస్తున్నాయని.. డబ్బులు మిగలడం లేదని చెబుతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నవారు.. తమ ఇంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే.. సంపద పెరుగుతుందట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

Vastu Shastra 2022

ఇంట్లో సంపద పెరగాలని అందరూ కోరుకుంటారు. చాలా మంది ఎంత కష్టపడి ఎంత సంపాదిస్తున్నా కూడా.. ఏమీ మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. తాము ఎంత కష్టపడినా సందప నిల్వడం లేదని.. ఏవో ఒక ఖర్చులు వస్తున్నాయని.. డబ్బులు మిగలడం లేదని చెబుతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నవారు.. తమ ఇంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే.. సంపద పెరుగుతుందట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

Vastu Tips -

మీరు మీ ఇంటికి అదృష్టం , సంపదను తీసుకురావాలని అనుకుంటే..  మీ ఇంట్లో అవసరం లేని వస్తువులను వెంటనే తీసేయాలి. అనవసరపు వస్తువులను ఇంటిని నింపకూడదు. దాని వల్ల ఉపయోగం ఉండదు. కేవలం ముఖ్యమైన వాటిని మాత్రమే ఇంట్లో ఉంచాలి. 


నీరు ప్రవహించేలా ఇంట్లో ఓ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తి పెరుగుతుంది. ఒక వేళ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవడం కుదరకపోతే.. నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపించే ఏదైనా ఫోటోని  ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. దాని వల్ల ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇంటి ముఖ ద్వారాన్ని వీలైనంత అందంగా, ఆకర్షించేలా ఏర్పాటు చేసుకోవాలి. తలుపు రంగు కూడా ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా.. ద్వారాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. ఇంటి ముఖ ద్వారాం అందంగా కనిపించేందుకు మొక్కలను కూడా పెట్టుకోవచ్చు.

సిట్రిన్ స్ఫటికాలు మీ ఇంటికి సంపదను ఆకర్షిస్తాయి. మీ ఇంట్లో స్ఫటికాలను ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద ప్రవహిస్తుంది. మీరు క్రిస్టల్ స్టోన్స్ లేదా క్రిస్టల్ ట్రీని ఉంచుకోవచ్చు, ఏది మీకు బాగా సరిపోతుంది. మీరు వీటిని మీ డబ్బును ఉంచే ప్రదేశంలో లేదా మీరు పనిచేసే చోట ఉంచవచ్చు.

మీ వంట గదిని ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. వీలైనంత వరకు నిత్యం వంట గదిని శుభ్రం చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ.. కిచెన్ శుభ్రంగా  ఉండేలా చూసుకోవాలి. స్టవ్, వంట పాత్రలు శుభ్రం చేసుకోవాలిల. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.
 

click me!