ఈ రాశుల వారు పరమ మొండి..వారు అనున్నదే జరగాలని అనుకుంటారు..!

Published : Jun 25, 2022, 09:55 AM IST

తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మొండితనంతో ఇతరులకు కూడా విసుగు తెప్పిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు కూడా చాలా మొండివారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..  

PREV
16
ఈ రాశుల వారు పరమ మొండి..వారు అనున్నదే  జరగాలని అనుకుంటారు..!

ఎవరితోనైనా అరిచి, బ్రతిమిలాడి గెలవచ్చేమో గానీ... మొండి వాళ్లతో మాత్రం గెలవలేం. వారు అనుకన్నదే జరగాలని పట్టుపడుతూ ఉంటారు. కాదు, కూడదు అంటే అస్సలు ఒప్పుకోరు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మొండితనంతో ఇతరులకు కూడా విసుగు తెప్పిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు కూడా చాలా మొండివారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

26

1.మేష రాశి..
ఈ రాశివారు  చాలా భయంకరంగా ఉంటారు. అందరిపై తమదే ఆధిపత్యం కావాలని అనుకుంటూ ఉంటారు. చాలా మొండిగా ఉంటారు. ఎవరి మాట వినరు. ఎదుటి వ్యక్తి... వీరిని బాధ పెట్టినా... వీరి వల్ల ఎదుటివారికి బాధ కలిగినా.. వీరు అస్సలు స్పందించరు. తాము అనుకున్నదే జరగాలని మొండి పట్టుదలతో ఉంటారు.

36


2.వృషభ రాశి..
వృషభ రాశివారు కూడా చాలా మొండివారు. వీరు ఒక్కసారి ఏదైనా అభిప్రాయానికి వచ్చారు అంటే.. దానిని మార్చడం ఎవరితరమూ కాదు. ఈ రాశివారు చాలా మొండి పట్టుదలతో ఉంటారు. ఒక్కోసారి వీరి మొండి పట్టుదల సానుకూలంగా ఉంటే.. మరోసారి ప్రతికూలంగా ఉంటాయి. వీరి మొండితనంతో.. అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం కూడా వీరికి ఎక్కువ.

46

3.కన్య రాశి..
కన్య రాశివారు తాము అనుకున్నది సాధించడానికి చాలా మొండిగా ఉంటారు. తాము చేస్తున్నది తప్పు అయినప్పటికీ.. ఎవరైనా ఆ విషయం చెప్పినా .. ఈ రాశివారు అంగీకరించరు. కన్యరాశివారికి పరిస్థితులు అర్థమైనప్పటికీ.. వాటిని ఒప్పుకోవడానికి మాత్రం అంగీకరించరు. వీరు ఇతరుల అభిప్రాయాలను మార్చాలని చూస్తారు.. కానీ.. తమ అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోరు.

56

4.మకర రాశి..
వారు తప్పు చేసినప్పుడు వారు అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ చివరి వరకు పోరాటం చేస్తారు. వీరు జీవితంలో చాలా పోరాటాలు చేసి ఆ స్థాయికి చేరుకుంటారు.. కాబట్టి... తమను తాము మాత్రమే నమ్మడానికి ఇష్టపడతారు. ఇతరులు వచ్చి.. తమకు నీతులు చెప్పడం.. తమకు ఏదైనా అర్థమయ్యేలా చెప్పాలని చూడటం వీరికి అస్సలు నచ్చదు. 

66

5.కుంభ రాశి..
ఈ రాశివారు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వింటారు. చాలా ప్రశాంతంగా విన్నట్లే ఉంటారు. కానీ.. తీరా చేసే సమయంలో మాత్రం తాము అనుకున్నదే చేస్తారు. వీరు చాలా విషయాల్లో మొండిగా ఉంటారు. తాము చేసేదే ఎప్పుడూ ఉత్తమం అని భావిస్తూ ఉంటారు. కుంభ రాశివారు.. తాము చేసింది తప్పు అని.. తల దించుకోవడం వీరికి నచ్చదు.

click me!

Recommended Stories