వేద జోతిష్యశాస్త్రంలో శని అన్ని గ్రహాలలో కెల్లా చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. శని ఒక రాశిలోకి అడుగుపెట్టాడు అంటే.. రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటాడు. శని కర్మ, న్యాయం, శిక్షను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల, దాని శుభ, అశుభ ప్రభావాలు కూడా ఎక్కువ కాలం ఉంటాయి. శని సంచారం లేదా రాశి మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. త్వరలో ఏప్రిల్ నెలలో తన సంచారాన్ని మార్చబోతున్నారు. ఏప్రిల్ నెలలో శని మీన రాశిలో ఉదయించడం వల్ల, కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది.డబ్బు విషయంలో మంచి స్థాయికి వెళతారు. కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కెరీర్, వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తారు. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...