మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాలకు అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టు వ్యవహారాలలో ఇబ్బందులు వస్తాయి. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాల చర్చిస్తారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావాలు తలెత్తే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది.
undefined
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం. కాంపిటీషన్స్ విషయంలో మరింత శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత అనుకూలమైన సమయం. ఋణాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇబ్బంది వచ్చే సూచనలు. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాలు రాణిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అనుకూల ఉన్నా జాగ్రత్త అవసరం.
undefined
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ప్లానింగ్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో కొంత ఆలోచనలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమ అధికం అవుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమ ఉన్నా ఫలితం సాధిస్తారు.
undefined
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలపై దృష్టిసారిస్తారు. ఆహార విహారాల గూర్చి చర్చించే అవకాశం. ప్రయాణాల విషయంలో కొంత ముందు జాగ్రత్త అవసరం. విందులు వినోదాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాదులకు అనుకూలమైన సమయం. సౌఖ్యంగా ఉంటున్నా ఏదో ఘర్షణ ఉంటుంది. విద్యార్థులు ఫలితాల విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి వస్తుంది. సంతాన వ్యవహారాల్లో కొంత శ్రమ తప్పకపోవచ్చు.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వార్తల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మీడియా రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. అపోహలకు కూడా అవకాశం ఏర్పడుతంది. సోదవర్గంలో చికాకులుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. ఆహార విహారాలకోసం ప్రయత్నం అవసరం. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
undefined
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కుటుంబ బంధువర్గ వ్యవహారాలు చర్చిస్తారు. మాటల్లో తొందరపాటు పనికిరాదు. నిల్వధనం మాటల వల్ల కోల్పోయే అవకాశం. మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. వ్యాపారాదుల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం . సంప్రదింపులు ఉంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది. పెద్దలతో అనుకూలత పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది.
undefined
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు. అప్రమత్తంగా ఉండాలి. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. శ్రమాధిక్యం పెరుగుతుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాదుల్లో కొంత ముందడగు పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నిర్ణయాదుల విషయంలో మరొక్కసారి గమనించుకోవడం మంచిది. కుటుంబ సంబంధాలపై దృష్టి పెరుగుతుంది.
undefined
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యర్థమైన ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పరమార్శలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాలలో ముందు జాగ్రత్త అవసరం. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. కాలం, ధనం, శ్రమ కోల్పోయే అవకాశం. ఆత్మ విశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. శారీరకమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. కొద్దిపాటి ఆరోగ్యం ఉంటుంది.
undefined
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వేరే వేరు రూపాల్లో ప్రయోజనాలను ఆశిస్తారు. పెద్దవారితో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. లాభాలు ఉన్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. వ్యాపారంలో అనుకూలత తగ్గుతుంది. వేరు వేరు పనులపై దృష్టి సారిస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కాలం, ధనం వ్యం అవుతుంది. ఏదో అధికారిక వ్యవహారాల కోసం ప్రయాణాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
undefined
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదులకు అనుకూలమైన సమయం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. పనిచేసే చోట కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు Sపనికిరాదు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. గౌరవలోపాలు రాకుండా చూసుకోవాలి. శ్రమాధిక్యం పెరుగుతుంది. వేరు వేరు రూపల్లో ప్రయోజనాలుంటాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత పెరుగుతుంది. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది.
undefined
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కొత్త పనుల నిర్వహణ చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉన్నా ఎక్కడో ఒకచోట ఇబ్బందులు కూడా ఉంటాయి. సుదూర ప్రయాణ లక్ష్యాలను ఇబ్బంది పడవచ్చు. వైజ్ఞానిక పరిశోధనలకు అనుకూలం. విద్యావ్యవహారాల్లో కొంత ఆచి, తూచి వ్యవహారించాలి.
undefined
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు తలెత్తే సూచనలు. అనారోగ్య లోపాలుంటాయి. ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అప్రమత్తంగా మెలగాలి. ఊహించని నష్టాలు ఉంటాయి. సంఘటనలు కొన్ని ఇబ్బంది పెడతాయి. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి కేంద్రీకరించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి కేంద్రీకరించకూడదు. ఉన్నత లక్ష్యాలను సధించేందుకు కృషి చేస్తారు.
undefined