మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నిర్ణయాదులకు అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల నిర్వహణలో తలమునకలవుతారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం అధికం. కుటుంబ, బంధువర్గ బాధ్యతలు విస్తరిస్తాయి. మాటవిలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులన్నా ధిగమిస్తారు. విలాసాలకోసం ధనం కాలం వెచ్చిస్తారు. మాటల్లో కొంత చమత్కారధోరణి ఉంటుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు అధికం. విహారాలు వింటాదులపై దృష్టి ఏర్పడుతుంది. వ్యతిరేక ప్రభావాలు తీవ్రమౌతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. పరామర్శలుంటాయి. ఆసుపత్రులను సందర్శించవచ్చు. ఆత్మవిశ్వాసంతో మెలగుతారు. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంతోషంగా గడుపుతారు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరస్తాయి. దక్షతతో, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనేక రూపాల్లో ప్రయోజనాలు వస్తాయి. లాభాలు వేరు వేరు రూపాల్లో అందినా శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ప్రణాళికలు చెడిపోయే అవకాశం. సంతానవర్గంతో జాగ్రత్త అత్యవసరం. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే సూచనలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు అధికమౌతాయి. వేరు వేరు కొనుగోళ్ళకు అవకాశం. అలంకరణ వస్తువులపై దృష్టి ఉంటుంది. పరామర్శలకు అవకాశం. ప్రయాణాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. దానధర్మాల వల్ల మరింత సంతోషం. సంతృప్తి ఏర్పడుతుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ప్టోలి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా రు. తండ్రివర్గ సంబంధమైన పనులు చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు అవకాశం. అనేక బాధ్యతలు నిర్వరి&ఇసత్తరు. నిర్వహణ బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికలు రచిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వేరు వేరు కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్య, ఉద్యోగం, పరిశోధన, దూర ప్రయాణాలు అన్నింకీ అనుకూలం. అధికారిక సహకారం అందుతుంది. సోదరవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. సంప్రదింపుల్లో సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సామాజిక హోదా గౌరవాదులు పెంచుకుంటారు. శ్రమ ఉన్నా సంతృప్తి ఉటుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఊహించని సంఘటనలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం కోల్పోవచ్చు. కుటుంబంలో బంధువర్గంతో సమస్యలుంటాయి. అత్యున్నత లక్ష్యాలపై దృష్టి పరిశోధనలకు అనుకూలం. సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలు, ధ్యానమార్గాలపై ప్రత్యేకదృష్టి పెడతారు. పరిశోధనలకు అనుకూలం. సుదూర ప్రయాణాలు చేస్తారు.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు అనుబంధాలు విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. కార్యనిర్వహణ దక్షత అవసరం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. కొద్దిపాటి అనారోగ్య భావన ఏర్పడుతుంది. తొందరపాటు కూడదు. బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలి. పరీక్షాకాలం. మిత్రుల సమాచారం అందుతుంది. అనుకోని సమస్యలున్నా శ్రమతో అధిగమిస్తారు. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. శ్రమ రహిత ప్రయోజనాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం ఉంటుంది. ఋణరోగాదులు శ్రమను గురి చేస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గే సూచనలు. మొండితనం తగ్గించుకోవాలి. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు. తొందరపాటు ప్రయాణాలు కూడదు. ప్రమాదావకాశాలు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మ విశ్వాసంతో సంతోషంగా వ్యవహరిస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన వర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. సృజనాత్మకతతో పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధమైన జీవిత విధానం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు అధికమౌతాయి. కార్యనిర్వహణలో శ్రమాధిక్యం పెరుగుతుంది. ఋణరోగాదులను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. వింటాదులు వినోదాలుంటాయి. విలాసాల కోసం ఖర్చులుంటాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణ దక్షత అవసరం. పదోన్నతులుంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు శ్రమకు గురిచేయవచ్చు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి. సంఆఆనంతో సంతోషం
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. అయినా కొంత అసంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. దైవధ్యానం అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభపరిణామాలు అధికారిక కార్యక్రమాలు లాభిస్తాయి. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. అధికారుల వల్ల మేలు కలుగుతుంది. క్రీడారంగంలోని వారికి గుర్తింపు పొందే సమయం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాలు లాభిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ఆలోచనలుంటాయి. కొన్ని అనుకోని సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. ఊహించని నష్టాలుంటాయి. వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి. సుదూర లక్ష్యాలను సాధించే యత్నం చేస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. మంచి వార్తలు వింటారు.