మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : ఆహార విహారాలపై దృష్టి పెడతారు. విందులు వినోదాలకోసం శ్రమిస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. గృహ, వాహనాది సౌకర్యాలు ప్రభావితం అవుతాయి. మాతృవర్గ వ్యవహారాలపై దృష్టి పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. శ్రమతో గుర్తింపు సాధిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారిక కార్యకలాపాలపై దృష్టి సారిసారిస్తారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికాబద్ధకంగా వ్యవహరిస్తారు.
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : సంప్రదింపులకు అవకాశం. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత విద్య, ఉద్యోగాదులుంటాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంపై దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. విహార యాత్రలకు అనుకూలమైన సమయం. విందులు వినోదాలకు సమయం వెచ్చిస్తారు. భాగస్వాములతో అప్రమత్తంగా మెలగాలి.
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. నిల్వధనంపై దృష్టి సారిస్తారు. మాటతీరులో సంతృప్తి లభిస్తుంది. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టిసారిస్తారు. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. లాభాలు ఆశించినంతంగా రాకపోవచ్చు. దానివల్ల కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. వేరు వేరు వ్యక్తులనుంచి సమాచారం అందుతుంది. అధికారిక వ్యవహారాల్లో పోటీలు అధికం.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో బిజీగా సమయం గడుపుతారు. గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. బంధువర్గ వ్యవహాలపై దీక్షి. నిల్వధనం ప్రభావితం చేస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడి తప్పకపోవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెట్టుబడులు ఖర్చులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలలో విజయం సాధిస్తారు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. అలంకరణలపై దృష్టి పెడతారు. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తారు. శక్తి సామర్థ్యాలు విస్తరిస్తాయి.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్నిరూపాల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు విస్తరించే అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి సారిస్తారు. కార్యనిర్వహణలో బిజీగా గడుపుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. సంతానవర్గ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం వఅఉతాయి. అధికారిక వ్యవహారాల కోసం వెచ్చిస్తారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు.
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. చేస్తున్న పనిలో సామర్థ్యం కోసం ప్రయత్నం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాల్లో శుభపరిణామాలు ప్రభావితం చేస్తాయి. పితృవర్గ వ్యవహారాలు సంతోషాన్ని, సంతృప్తినిస్తాయి. పదోన్నతులుంటాయి. గుర్తింపు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు.
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాదులు నిర్వహిస్తారు. కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభపరిణామాలు . సంప్రదింపులకు అనుకూలమైన సమయం. విద్య, ఉద్యోగ, వైజ్ఞానిక పరిశోధనా రంగాల్లో అనుకూలత. వృత్తిలో శుభపరిణామాలు. అధికారిక కార్యాలకు అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. శారీరక ఒత్తిడులు ఉంటాయి.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. 239 అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమ రహిత ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడదు. ఉన్నత్యవహారాలపు నిర్వహిస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు సాధించేందుకు ప్రయత్నం చేస్తారు. అన్ని పనుల్లో శుభ పరిణామాలు.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : స్నేహానుబంధాలు పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. కొత్త పనులపై దృష్టి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీలు ఒత్తిడులు, వ్యతిరేకల ప్రభావాలు తప్పకపోవచ్చు. ఋణరోగాదులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. కాంపిటీషన్స్ లో విజయం సాధిస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తిచేయాల్సి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది. శారరీకమైన అలసట ఉంఉంది. పరిచయాలు స్నేహాలు విస్తరిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతులున్నా సమస్యలకు కూడా అవకాశం.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తుంది. అన్ని పనులనూ నిర్వహిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నూతన నిర్ణయాదులు లాభిస్తాయి. సంతోషం లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలు పెరుగుతాయి. విజయం సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత, పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. ఋణ రోగాదులను అధిగమిస్తారు.