weekly horoscope: ఈ వారం( 13డిసెంబర్ నుంచి 19 డిసెంబర్ వరకు ) రాశిఫలాలు

First Published Dec 13, 2019, 3:18 PM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆహార విహారాలపై దృష్టి పెరుగుతుంది. గృహ వాహనాది సౌకర్యాలను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తారు. విందులు, వినోదాలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విద్యారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభపరిణామాలు ఉంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. సంతాన వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. అనారోగ్య లోపాలు లేకుండా చూసుకోవాలి.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. నూతనమైన వార్తలు వింటారు. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంలోని వారితో అనుకూలత పెరుగుతుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత మేలు కలుగుతుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మాట విలువ పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆర్థిక నిల్వలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం ఏర్పడుతంది. అప్రమత్తంగా మెలగాలి. చిట్స్ మొదలైన వ్యవహారాల్లో ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వవర్గ వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. అధికారిక భాగస్వామ్యాలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులనూ నిర్వహిస్తారు. బాధ్యతలు పెంచుకుంటారు. గుర్తింపు లభిసుతంది. వ్యవహారాల వల్ల సంతోషం కలుగుతుంది. సంతృప్తి ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలలో శుభపరిణామాలు ఉంటాయి. అనేక కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. క్రొత్త ప్రణాళికలు ఉంటాయి. విందులు వినోదాల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ప్రభావాన్ని చూపుతాయి. మాట తీరులో కొంత అధికారిక ధోరణి కనబడుతుంది. కుటుంబ, బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఖర్చులు అధికం అవుతాయి. వేరువేరు రూపాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. వినోదాలు విహారాలకు అవకాశం ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలుంటాయి. శ్రమతో అన్ని పనులను సాధిస్తారు. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమ అధికం అవుతుంది. విద్యా రంగంలోని వారికి ఇబ్బందులు తప్పవు.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. కొత్త ప్రణాళికలుంటాయి. సంతానవర్గ వ్యవహారాలకు అనుకూలత ఏర్పడుతుంది. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెట్టుబడులు అధికమౌతాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. వినోదాలపై దృష్టి పెరుగుతుంది. అధికారికమైన సహకారం లభిస్తుంది. విలాసాలకనాన దానధర్మాలు మేలు చేస్తాయి.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు వస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం కలుగుతుంది. పితృవర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. బాధ్యతలు అధికం అవుతాయి. ఆహార విహారాలకు అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనులకు అనుకూలమైన సమయం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకూలత పెరుగుతుంది.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అవకాశం పెరుగుతుంది. ఉన్నతమైన పనులను సాధిస్తారు. చదువు, సాంకేతిక పరిశోధనా రంగాలవారికి అనుకూలత పెరుగుతుంది. కొత్త పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వ్యవహార నిర్వహణ పెరుగుతుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. ఇతరుల సహకారం లభిస్తుంది. వృత్తిలో అనుకూలత పెరుగుతుంది. అధికారిక వ్యవహారాలలో శుభపరిణామాలు వస్తాయి. పదోన్నతులు ఉంటాయి.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనారోగ్య భావనలుంటాయి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ, ఆర్థిక, బంధువర్గ వ్యవహారాల్లో తెలియని చికాకులకు అవకాశం ఉంటుంది. అత్యున్నత కార్యక్రమాలను చూస్తారు. కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. కొన్ని ఖర్చులు తప్పకపోవచుచ. పెట్టుబడులలో జాగ్రత్త అవసరం.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల కలయిక లేదా సమాచారం అందుతుంది. ప్రయాణాలకు అవకాశం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులకూ అనుకూలమైన సమయం. సంతోషంగా కాలం గడుపుతారు. అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావనలు వస్తాయి. ఆసుపత్రులను దర్శిస్తారు. లాభాలు కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు, చికాకులకు అవకాశం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ముఖ్య కార్యక్రమాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. కాంపిటీషన్స్ లో విజయం లభిస్తుంది. పోటీరంగంలో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలకు అనుకూలమైన సమయం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. పదోన్నతులు ఉంటాయి. బాధ్యతలు అధికం అవుతాయి. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. ఉన్నతమైన పనులను సాధిస్తారు. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ప్లానింగ్ కు అనుకూలమైన సమయం. కార్యక్రమాల్లో శుభపరిణామాలు వస్తాయి. లాభాలు సంతోషాన్ని ఇస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు తప్పక లభించే అవకాశం ఉంటుంది. వ్యతిరేకతలు పోటీలు అధికం అవుతాయి. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్య్రకమాలు నిర్వహిస్తారు. శత్రు రోగాలను అధిగమించాలి.
undefined
click me!