ఈ వారం( డిసెంబర్ 6నుంచి డిసెంబర్ 12 వరకు) రాశిఫలాలు

First Published | Dec 6, 2019, 9:07 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు చికాకులు ఉన్నా వాటిని అధిగమించాలి. శత్రు ఋణ రోగాదులు అధికం అవుతాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అనేక కార్య్రకమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. శారీరకమైన ఒత్తిడులునాన అనేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాలలో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో శ్రమ ఉటుంది. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. బంధువర్గ వ్యవహారాలను చర్చిస్తారు. అధికారికమైన సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లో చికాకులకు అవకాశం ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు చికాకులు ఉన్నా వాటిని అధిగమించాలి. శత్రు ఋణ రోగాదులు అధికం అవుతాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. నిర్ణయాల్లో అనుకూలత ఉంటుంది. ఆత్మ విశ్వాసం లభిస్తుంది. భాగస్వామ్య అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార అనుబంధాలు మెరుగుపడతాయి. అధికారులతో కొంత అనుకువగా ఉండడం మంచిది. నూతన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : లాభాలు సంతృప్తినిసాతయి. అనేక రూపాల్లో ప్రయోజనాలకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆల్లోచనల్లో ఒత్తిడులకు అవకాశం. సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జాగ్రత్త అవసరం. సంతానవర్గ వ్యవహారాల్లో ఘర్షణ ఏర్పడుతుంది. కొత్త పనులను నిర్వహిస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. కాంపిటీషన్స్ లలోఅనుకూలత ఉంటుంది. విశ్రాంతికోసం ప్రయత్నిసాతరు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పదోన్నతులకు ప్రయత్నిస్తారు. సౌకర్యాల విషయంలో జాగ్రత్త అవసరం. సౌఖ్యం కోసం ఎదురుచూసినా దొరకక పోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ సాగిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. అన్ని పనుల్లోనూ లాభాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అవి లభిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాదుల్లో ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పనులపై దృష్టి సారిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. విద్య, ఉద్యోగం, సాంకేతిక రంగాల వారికి గుర్తింపు ఉంటుంది. సుదూర ప్రయాణాలపై ఆసక్తి కనబరుస్తారు. సోదర వర్గంతో కొంత జాగ్రత్త అవసరం. సహకార లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. సంప్రదింపుల్లో ఒత్తిడులు ఉంటాయి. వార్తల వల్ల మానసికమైన చికాకులు. వృత్తిలో ఉన్నతి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. తండ్రి వర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. సౌకర్యాల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని పనుల్లోను అనుకోని ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా డాలి. అనారోగ్య భావనలు వస్తాయి. చికాకులు అధిగమించాలి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. మాటల్లో తొందరపాటు కూడదు. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం ఉంది. బంధువర్గం వారితో జాగ్రత్తగా మెలగాలి. అత్యున్నత కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. విద్యా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. నూతన స్నేహానుబంధాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార, జీవిత భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లోనూ ఇబ్బందులు ఎదురుకావచుచ. అనారోగ్య భావనలు ఉంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అన్ని పనుల్లోనూ పోటీలు ఎదురు కావచ్చు. వ్యతిరేకతలు అధికం అయ్యే సూచనలు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. ఋణాదులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. కాంపిటీషన్స్లో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు, పెట్టుబడులు పనికిరావు. విశ్రాంతిలోపం సంభవిస్తుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పాత మిత్రతుల సమాచారం లభిస్తుంది. అనేక కార్యక్రమాలలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రయోజన దృష్టి అధికం అవుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సృజనాత్మకతను పెంచుకుంటారు. సంతానవర్గ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు ఉంటాయి. సంతోషంగా కాలం గడుపుతారు. పోటీ భావాలు పెరుగుతుంటాయి. విజయం సాధిస్తారు. కార్యక్రమాల నిర్వహణలో శ్రమ తప్పకపోవచ్చు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. విందులు, వినోదాలపై దృష్టి పెడతారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. విహారాల్లో సంతోషం కనిపిస్తుంది. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలు ఉంటాయి. గృహ వాహన వ్యవహారాల్లో నూతన నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి, శ్రమాధిక్యం ఉంటాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్ఫడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కార్యనిర్వహణకు ప్రణాళికలు ఉంటాయి. ఆదాయ మార్గాలపై దృష్టి ఉంటుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంప్రదింపులు ఉంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదర వర్గంతో కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. కొన్ని వార్తల వల్ల కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. సుదూర ప్రయాణాల విషయంలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆధ్యాతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవధ్యానం మంచిది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సంతృప్తి అధికం అవుతుంది. సౌఖ్యంగా కాలం గడుపుతారు. విందులు వినోదాలు ఉంటాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కుటుంబ వ్యవహారాలు ప్రాధాన్యం వహిస్తాయి. బంధువర్గంతో అనుకూలత పెరుగుతుంది. ఆర్థకి నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటతీరులో శుభ పరిణామాలు ఉంటాయి. ఐనా కొన్ని అనుకోని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అసౌకర్యాలకు, ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. మంచి వార్తలు వింటారు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

Latest Videos

click me!