telugu astrology: డిసెంబర్ నెల రాశిఫలాలు

First Published | Dec 1, 2019, 8:02 AM IST

ఈ డిసెంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందుతుంది. సంతాన వర్గం అభివృద్ధి ఆనందాన్ని కలుగచేస్తుంది. ఆరోగ్య విషయంలోను ప్రయణాది విషయాలలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం సూచితం. 23,24,25 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
2.వృషభం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం , విద్యార్ధులకు విషయాలపై అవగాహన పెరుగుతుంది. వృత్తిలో క్రింది ఉద్యోగుల సహాయ సహకారంతో పనులను పూర్తి చేసుకోగల్గుతారు. ఐటీ రంగంలో విజయావకాశాలు అధికం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. 26, 27 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, విష్ణ్వారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined

Latest Videos


3. మిధునం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి సామాజిక సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్ధిక లాభాలు సూచితం. విద్యార్ధులకు శ్రమ అధికం. ఆత్మీయులు దూరం కాకుండా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పొటీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. 28,29 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
4. కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వృత్తి, ఉద్యోగ విషయాలలో అనుకూల వాతావరణం ఉండును. పొటీ రంగంలో విజయావకాశాములు అధికంగా ఉండును.కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలు చేయుటకు ఆస్కారమున్నది. మాట విలువ పెరుగును. తన పని తాను చేసికోవటం వలన విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు ఉత్తమ సమయం. 30,31,3,4 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
5. సింహం : వీరికి గోచారగ్రహస్థితి శూభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. విద్యార్థులకు ఉత్తమ సమయం. భ్రాతృ వర్గ సహకారం ప్రయోజనకరంగా ఉండును. సంతానవర్గం అభివృద్ధి ఆనందప్రదంగా ఉండును. పాత బాకీలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. 6, 7 తేదీలలో ముఖ్య నింయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
6. కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. జన సహకారం ప్రయోజనకంంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. విద్యార్థులకు ఇది ఉత్తమ సమయం. వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధనలాభం సూచితం. 8,9 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
7. తుల : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. విద్యార్ధులకు ఇది అనుకూల సమయం. మీ కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడం విషయంలో మిత్రుల సహకారం లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. 10, 11, 12 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
8. వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వృత్తిలో ఇతరులకు సహకరించడంవలన గౌరవాన్ని పెంచుకుంటారు. అనుకోని ఖర్చులు ఇబ్బందిని కలిగిస్తాయి. మాసాంతంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసివస్తుంది. 13, 14 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
9. ధనుస్సు : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ప్రథమార్ధంలో వృత్తి, ఉద్యోగల విషయాలలో లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆధ్యత్మిక అభివృద్ధి అవకాశం ఉంటుంది. 14, 15 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
10. మకరం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ వ్యవహారాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. వృత్తి, ఉద్యోగ విషయాలలో ఆర్ధికాభివృద్ధి సూచితం . ఇతరులకు ఉపకరించడం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. విద్యార్ధులకు ఉత్తమ సమయం. పొటీ రంగంలో విజయావకాశాలు అధికం. 17, 18 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
11. కుంభం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి, ఆర్ధిక లాభాలు సూచితం. పెట్టుబడులకు అనుకూల సమయం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతారణం నెలకొనును. వివాహాది శుభకార్యాలకు అవకాశములు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. 19,20 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
12. మీనం : వీరికి గోచారగ్రహస్థితి శూభాశూభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం ఉండును. వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి ఆర్ధిక లాభాలు సూచితం. ప్రయాణాది విషయాలలో జాగ్రత్త పాటించాలి. కుటుంబ సౌఖ్యం, మాట విలువ పెరుగుతుంది. 21,22 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
click me!