డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనుకున్న మేర లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు ఆటుపోట్లు అధిగమిస్తారు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. ఆకస్మిక ధనలాభ సూచనలు. ప్రముఖులు మీకు అన్నివిధాలా సహాయపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెట్టడంలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కొంతమేర కలసివస్తాయి. వివాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ వారం ఆలోచనలు స్థిరంగా ఉండక గందరగోళంలో పడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అప్పుల కోసం యత్నిస్తారు. బంధువులు మీపై కొన్ని అపవాదులు మోపవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. పరిస్థితుల ప్రభావంతో కొన్ని ముఖ్య వ్యవహారాలను వాయిదా వేస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ వారం వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు మీకు సహాయకారులుగా నిలుస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రతికూల పరిస్థితులలో సైతం నేర్పుగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం ఏ వ్యవహారమైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల ద్వారా అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు కొంత పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఒక ఆసక్తికర సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖుల సలహాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతమైన కాలం. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) వారికి :- ఈ వారం వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం కాగలవు. పాత బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహా యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆసక్తికర మార్పులు జరుగుతాయి. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. స్వల్ప అనారోగ్యం. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా కొనసాగుతాయి. ఆప్తులతో నెలకొన్న వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ వారం ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం కాగలవు. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి కొంత ఫలిస్తుంది. కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఒప్పందాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది..
మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువిరోధాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ వారం ప్రత్యర్థులు సైతం మీకు సహకరించడం విశేషం. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ స్థాయి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, ఊహించని ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. వారం ప్రారంభంలో. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ వారం అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. మొదట్లో కొన్ని ఇబ్బందులు నెలకొన్నా అధిగమిస్తారు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. సంఘంలో మీపై మరింత ఆదరణ పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.