ఈ వారం ఆగస్టు 23నుంచి ఆగస్టు 30 వరకు రాశిఫలాలు

First Published Aug 23, 2019, 11:43 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం కోసం ప్రయత్నం. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. వార్తల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. ఆశలక లొంగవద్దు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరుల విషయంలోనూ కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక భావాల వల్ల మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. గృహ, వాహనాది సౌకర్యాల గూర్చి ఆలోచనలు, చర్చలు ఉంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కుటుంబ బంధువర్గ అనుబంధాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నిల్వలపై దృష్టి ఉంటుంది. ఆశలు అధికమౌతాయి. మాట్లాడే సందర్భంలో అప్రమత్తంగా మెలగాలి. ఆచి, తూచి వ్యవహరించాలి. అనుకోని సమస్యలకు అవకాశం ఉంది. తొందరపాటు కూడదు. కమ్యూనికేషన్స్‌ బాగా పెంచుకుంటారు. దగ్గరి ప్రయాణాలుటాంయి. వ్యాపారాత్మకమైన పర్యటలను తప్పకపవోచ్చు. మంచి వార్తలు వింరు. శ్రీమాత్రేనమః.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎదుటి వారి భావాలకు లొంగకుండా ఉండాలి. బాధ్యతలు పెరుగుతాయి. అత్యాశ, దురాశలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. శ్రమతో కార్యక్రమాలుటాంయి. క్రియేటివిటీ పెరుగుతుంది. భాగస్వామ్యాల్లోనూ కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభ పరిణామాలు. నూతన బంధుత్వాలు, పరిచయాలు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు కార్యక్రమాల నిర్వహణ కోసం ధనం, కాలం వెచ్చించాల్సి వస్తుంది. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. జాగ్రత్త పడకపోతే కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాదులకు అవకాశం. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. బాధ్యతలు విస్తరిస్తాయి. కొత్త కార్యక్రమాలను నిర్వహించాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :అన్ని పనుల్లోనూ లాభాలుటాంయి. అధికమైన శ్రమలేని ప్రయోజనాలను బాగా ఆశిస్తారు. తొందరపాటు కూడదు. పెద్దలతోనూ అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనులు సంతోషాన్నిస్తాయి. సంతానవర్గ వ్యవహారాల్లో అతి జాగ్రత్త అవసరం. నిరాశ అధికం. ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు పెట్టుబడులు అధికమౌతాయి. ప్రయాణాలకు అవకాశం. విశ్రాంతి లభిస్తుంది. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. ఓం నమఃశ్శివాయ జపం మంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. బాధ్యతలు అధికం అవుతాయి. సామాజిక వ్యవహారాల్లో పాలు పంచుకుటాంరు. పితృవర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. వేరువేరు కార్యక్రమాల ఒత్తిడుల వల్ల శరీర సౌఖ్యం తగుతుంది. ఆహార విహారాలు క్రమపద్ధతిలో సమయానుసారంగా ఉండడం శ్రేష్ఠం. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణాలకు అవకాశం. వేరు వేరు విహార యాత్రలకోసం ప్రణాళికలుటాంయి. ఎన్నో పనులు నిర్వహించాలని ఉన్నా ఏదో అసంతృప్తి ఉంటుంది. ఇతరుల సహకార అధికంగా లభించదు. సేవకర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు మరింత పెరుగుతుంది. దాన ధర్మాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. గౌరవం పెంచుకుటాంరు. శ్రీమాత్రేనమః.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. ఊహించని సంఘటనలుటాంయి. కాలం, ధనం, వ్యర్థం అవుతాయి. అనారోగ్య భావనలు. బలహీనత ఎదురౌతుంది. ఆశలు అధికమౌతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. అత్యున్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. సుదూర ప్రయాణాలకు అవకాశం. సంతృప్తితో కాలం గడుపుతారు.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో ప్రయాణాలకు అవకాశం. నిర్ణయాదుల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. అనవసర వ్యక్తుల వల్ల కాలం ధనం వ్యర్థం కావచ్చు. వ్యాపార వ్యవహారాల్లోనూ ఆచి, తూచి ప్రవర్తించాలి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. ఊహించని సంఘటలు వస్తాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీలు ఒత్తిడులు అధికం అవుతాయి. వ్యతిరేక ప్రభావాలను శ్రమతో అధిగమించాలి. శత్రువులు, ఋణాలు, రోగాలను అధిగమించే ప్రయత్నం అవసరం. కార్య నిర్వహణ దక్షత అవసరం. వేరు వేరు కార్యక్రమాల నిర్వహణ అవసరం. మానసికమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. మొండితనంతో పనుల నిర్వహణ అవసరం. భాగస్వామితో సంప్రదింపులు అవసరం. సంతోషంగా గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొటాంరు. సృజనాత్మ పెరుగుతుంది. కొత్త పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. పోటీలు, ఒత్తిడులు చికాకులు ఉంటాయి. అన్ని పనుల్లోనూ వ్యతిరేకతలు ఎదురు కావచ్చు. అధైర్యం అవసరం లేదు. ఋణభావాలు కూడా ఇబ్బందిపెడతాయి.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆహార విహారాలపై దృష్టి పెడతారు. గృహ, వాహనాది వ్యవహారాలు ప్రేరేపిస్తాయి. ప్రయాణాలకు అవకాశం. విద్యారంగంలోని వారికి మరిన్ని ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. ఊహలు, అధికం అవుతాయి. అపోహలు కాకుండా చూసుకోవాలి. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్ప ఏర్పడుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. శ్రీమాత్రేనమః.
undefined
click me!