ఈ వారం( ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15వరకు) రాశిఫలాలు

First Published Aug 9, 2019, 9:55 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. అభ్యున్నతి ఏర్పడుతుంది. సాధించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కొంత అసంతృప్తి కూడా తప్పకపోవచ్చు. ఆధ్యాత్మికమైన ప్రయాణాల వల్ల పరిపూర్ణమైన అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. సౌఖ్యంగా గడుపుతారు. వృత్తిలో ఒత్తిడులు ఏర్పడతాయి. శ్రమతో గౌరవం పెరుగుతుంది. సామాజికాంశాలు చర్చలోకి వస్తాయి. పితృవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్యం కూడా కలిగే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవడం శ్రేష్ఠం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. కాలం ధనం శ్రమ వ్యర్థం కావచ్చు. సుదూర ప్రయాణ భావనలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. సంతృప్తిగా గడుపుతారు. వైజ్ఞానిక, పరిశోధన, విద్యారంగాల వారికి అభివృద్ధి. ఉన్నత విద్య ఉద్యోగాదులకు అవకాశం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. సామాజిక అనుబంధాలు ఇబ్బంది పెట్టే సూచనలు. కొత్త పరిచయాల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. భాగస్వామితో కలిసి దైవకార్యాలపై దృష్టి కేంద్రీకరించడం మరింత శ్రేష్ఠం. బద్ధకం తగ్గించుకోవాలి. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. కొంత అనారోగ్య భావన కూడా ఉంటుంది. ముఖ్య నిర్ణయాల వాయిదా వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాల వల్ల లోపాలు నివారించబడతాయి. చికాకు అధికం. అనుకోని నష్టాలు, ప్రమాదాలకు అవకాశం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వ్యతిరేక ప్రభావాలు అత్యధికం. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. శారీరకమైన ఒత్తిడులు అధిగమించాలి. ఆర్థిక వ్యవహారాలు, ఇచ్చి పుచ్చుకోవడం మొదలైన అంశాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. పోటీరంగంలో విజయం సాధించినా కొంత అసంతృప్తి ఉంటుంది. చికాకులను దైవధ్యానంతో అధిగమించి విజయం సాధించాలి. సామాజిక అనుబంధాలు పెంచుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక లేదా సంప్రదింపులుంటాయి. పరిచయాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నిర్ణయాదుల్లో ఆలస్యం సంభవం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతానవర్గ వ్యవహారాలు కొంత చికాకును తెప్పించవచ్చు. స్పెక్యులేషన్‌ కూడా ఆశించినట్లు ఉండదు అనవసర విషయాల ఆలోచనల కన్నా ఆధ్యాత్మిక జీవనం మరింత శ్రేష్ఠం. పోటీలు, ఒత్తిడులు, చికాకులున్నా విజయం సాధిస్తారు. వేరు వేరు వ్యక్తుల వ్యతిరేకతలు అర్థం అవుతున్నా అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. ఋణాదులపై విజయం సాధిస్తారు. పోటీరంగంలో గుర్తింపు, వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. కార్యనిర్వహణ దక్షత. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. శారీరక ఒత్తిడులుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ అవసరం. ప్రయాణాదుల్లో ఒత్తిడులుంటాయి. సౌఖ్యలోపం ఏర్పడుతుంది. గృహ, వాహనాదుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. విద్యారంగంలోని వారికి శ్రమాధిక్యం అవసరం. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి కలుగుతుంది. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. కొత్త నిర్ణయాలు ఆలోచనలు సంతోషాన్నిస్తాయి. శ్రీమాత్రేనమః జపం.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. సహకార లోపాలకు అవకాశం. సేవకవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాదుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వార్తల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కమ్యూనికేషన్‌కసలో అప్రమత్తంగా మెలగడం మంచిది. ఆహార విహారాలపై దృష్టి ఏర్పడుతుంది. గృహ, వాహనాది సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. శ్రమ ఉన్నా సంతోషం ఏర్పడుతుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి మేలు కలుగుతుంది. శ్రీమాత్రేనమః.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కుటుంబ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బంధువర్గంతోనూ అప్రమత్తంగా మెలగాలి. ఆర్థిక నిల్వలను కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గే సూచనలు. కొంత ఆర్థిక అసంతృప్తి ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్‌కస విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. సోదరవర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి లభిస్తాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. విద్యా ఉద్యోగ రంగాల్లో కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : నిర్ణయాదులు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం. అన్ని పనుల్లోనూ కొంత ఆలస్యం జరుగవచ్చు. బాధ్యతలు అధికం. నిర్వహించలేక సతమతం అవుతుాంయి. దైవధ్యానం వల్ల శక్తిని పెంచుకునే అవకాశం కలుగుతుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలు వస్తాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. బంధువర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలుంటాయి. వేరు వేరు కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనుకోని సంఘటనలకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనారోగ్య భావన వస్తుంది. కాలం, ధనం, శ్రమ వ్యర్థమయ్యే సూచనలు ఉన్నాయి. పరామర్శలకు అవకాశం లభిస్తుంది. ఆసుపత్రుల దర్శనం లేకుండా చూసుకోవాలి. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. ఆహార విహారాలు, విందు, వినోదాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమా నిర్వహణ చేస్తారు. కొత్త పనులపై దృష్టి ఏర్పడుతుంది. బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. శ్రీమాత్రనమః జపంమంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : లాభాలున్నా ఆశించిన సంతోషం అందకపోవచ్చు. కొత్త పనుల నిర్వహణలో జాగ్రత్త అవసరం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ప్రయోజనాలు లభించినా సంతృప్తి తక్కువ. వ్యవహారాల్లో కొంత అప్రమత్తత అవసరం. ఖర్చులు పెట్టుబడులు అధికం. అయినా సంతోషంగా సమయం గడుపుతారు. కాలం, ధనం కోల్పోకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం. విందులు వినోదాలకోసం వెచ్చిస్తారు. విశ్రాంతిగా, సౌఖ్యంగా కాలం గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక గౌరవం తగ్గే సూచనలు. ఉద్యోగ తదితర బాధ్యతల నిర్వహణలో శ్రమ అధికం. పితృవర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆశించిన పదోన్నతులు అందక నీరసానికి లోనయ్యే అవకాశం. కొంత నిరాశ తప్పకపోవచ్చు. సౌకర్యాలపై దృష్టిఉన్నా శ్రమ ఉంటుంది. అన్ని రూపాల్లో ప్రయోజనాలుంటాయి. వేరు వేరు లాభాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. గుర్తింపులు గౌరవాదులు లభిస్తాయి. పెద్దల అనుకూలత, ఆశీస్సులు లభిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
click me!