astrology: ఈ వారం ( 29నవంబర్ నుంచి 5 డిసెంబర్ వరకు) రాశిఫలాలు

First Published | Nov 29, 2019, 10:13 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. అనుకోని సమస్యలున్నా శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో స్పష్టతకోసం ప్రయత్నం. పదోన్నతులు ఉంటాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మరింత మేలు కలుగుతుంది. కొంత ఆలస్యం వల్ల ఇబ్బందిపడే సూచనలు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. కొత్త పనులపై ఆసక్తి పెంచుకుంటారు. లాభాల వల్ల సంతోషం కలుగుతుంది.
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. అనుకోని సమస్యలున్నా శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమించి గౌరవం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి ఉన్నా శ్రమాధిక్యం ఉంటుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తండ్రివర్గ సంబంధమైన కార్యక్రమాల్లో చుక్కెదరువవుతుంది. అప్రమత్తంగా మెలగాల్సిన సమయం. సామాజిక స్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు.

మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. అన్నిపనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. శ్రమరహిత ప్రయోజనాలపై దృష్టి పెంచుకోవద్దు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి, లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. చేస్తున్న పనిలో నైపుణ్యం పెరుగుతుంది.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : భాగస్వామ్యాల్లో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త స్నేహానుబంధాలకు అవకాశం ఏర్పడుతుంది. పాతమిత్రుల కలయిక జరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత ఆచి, తూచి వ్యవహరించాలి. కొంత పోటీతత్వం ఉంటుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. బాధ్యతలు విస్తరిస్తాయి. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. తొందరపాటు వల్ల పనులు ఆలస్యం లేదా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీలను అధిగమిస్తారు. గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారు. ఋణరోగాదులను అధిగమించాల్సి వస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభపరిణాలు ఏర్పడతాయి. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలకు అనుకూలమైన సమయం. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మ విశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలను సంతోషంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆలోచనకు రూపకల్ప ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సృజనాత్మక వ్యవహారాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సంతాన వ్యవహారాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. వ్యతిరేకతతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఋణరోగాదులు ఇ్బంది పెట్టే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. పోటీరంగంలో అనుకూలత ఏర్పడుతుంది.
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. గృహ వాహనాదుల గూర్చి చర్చిస్తారు. ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. సౌఖ్యంగా గడుపుతారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభపరిణామాలు ఏర్పడతాయి. అధికారిక వ్యవహారాలకు అనుకూలమైన సమయం. సృజనాత్మకమైన వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలకి అనుకూలమైన సమయం.
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంప్రదింపులకు అనుకూలం. సేవకవర్గ సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. సోదరవర్గ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. పాతమిత్రుల కలయిక జరుగుతుంది. మాటల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం రావచ్చు. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ, వాహనాది సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. మాతృవర్గీయుల ప్రభావాలు ఉండే అవకాశం. విందు వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు అధికం అఉతాయి. శారీరక ఒత్తిడి తప్పకపోవచ్చు. నిర్ణయాదులు తీసుకోవడంలో ఆలస్యానికి అవకాశం ఉంటుంది. మాటతీరులో జాగ్రత్త వహించాలి. తొందరపాటు కూడదు. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేయడం శ్రేష్ఠం. సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. కొత్త వార్తలకు అవకాశం కలుగుతుంది. మీడియీ రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలున్నా శ్రమ కూడా తప్పకపోవచ్చు.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతలు అధికం అవుతాయి. గుర్తింప లభిస్తుంది. నిర్ణయాదుల వల్ల కొంత శ్రమ, కాలం, ధనం వ్యక్తం కావచ్చు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కొనొగుళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు పెట్టుబడులకు అనుకూలమైన సమయం. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. పరామర్శలకు అవకాశం ఏర్పడుతుంది. లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు కూడా అధికం అవుతాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమ ఉన్నా కార్యనిర్వహణ తప్పకపోవచ్చు. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు విస్తరించే అవకాశం ఉంటుంది.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. లాభాలు ఆశించినంతంగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం ఉంటుంది. సామాజిక గౌరవం కోసం ప్రయత్నిస్తారు. కొత్త పనుల నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులు ఉంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పరామర్శలకు కూడా అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!