weekly horoscope: ఈ వారం రాశిఫలాలు( ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు)

First Published Feb 26, 2021, 9:06 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని  చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు మందగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయటా ఎదురుండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో భూవివాదాలు. మానసిక అశాంతి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాల సందర్శనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విశేష లాభదాయకమైన సమయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఓర్పుతో కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. సన్నిహితులతో విభేదాలు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆప్తుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేర్పు, ఓర్పుతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం చేపట్టిన వ్యవహారాలు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఊహించని ఆహ్వానం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అందరిలోనూ మీ ప్రతిభ, సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని చికాకులు తొలగుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. సోదరులతో కలహాలు. బంధువులు, మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆస్తిలాభం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు ఎట్టకేలకు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. బంధువులతో వివాదాలు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!