జ్యోతిషశాస్త్రం తరచుగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వివరించడానికి మరియు అతను జన్మించిన సమయంలో సూర్యుడు, చంద్రుడు ఇతర జ్యోతిష్కుల స్థానాల ఆధారంగా వారి జీవితాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రం చాలా పురాతనమైనది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు సమయాల్లో వివిధ నాగరికతలచే అధ్యయనం చేసి సవరించారు
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఎంపిక అతని రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎంచుకునే దుస్తుల రకం కూడా రాశిచక్రం ఆధారంగా నిర్ణయించవచ్చు. కాబట్టి జ్యోతిషశాస్త్రం ప్రకారంఏ రాశి అమ్మాయిలు ఎలాంటి బట్టలు ఇష్టపడతారో తెలుసుకుందాం.
1.మేష రాశి..ఈ రాశివారు సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వీరు సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడతారు.
2. వృషభ రాశి..ఈ రాశిచక్రం యొక్క ప్రజలు చాలా ధైర్యవంతులు. అయితే.. దుస్తులు ఎంచుకునే విషయానికి వస్తే, వారు బోల్డ్ బట్టలు ధరించడాన్ని పెద్దగా ఇష్టపడరు. బదులుగా, వారు కొద్దిగా పాత సాంప్రదాయ దుస్తులను ధరించడానికి ధైర్యం చేస్తారు మరియు మరింత సుఖంగా ఉంటారు. వారు చీర ధరించడం కూడా ఇష్టపడతారు.
3. మిథున రాశి..వీరు చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు. అదీ.. ఇదీ అనేది లేకుండా.. అన్నిరకాల దుస్తులు వేసుకోవడానికి వీరు రెడీగా ఉంటారు.
4. కర్కాటక రాశి..వారు వదులుగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. ఈ రాశిచక్రం వారు ఎక్కువగా కాటన్ దుస్తులనే ధరిస్తారు.మేరేదీ ఆలోచించలేరు. వారు ట్రెండింగ్ దుస్తులలో కాకుండా కాటన్ ఉంటాయోమో అని వెతుకుతుంటారు.
5.సింహరాశి..వీరు డ్రెస్ ఏదైనా సౌకర్యంగా ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వీరి మొదటి ఛాయిస్ సౌకర్యం.
6. కన్యరాశి.. వీరు ట్రెండింగ్ డ్రెస్ లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారు ఫ్యాషన్ దుస్తులంటే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి డ్రెస్ లనే ఎక్కువగా ధరిస్తారు. మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ ఏముందనే విషయం వీరికే బాగా తెలుస్తుంది.
7. తుల రాశి...ఈ రాశివారికి స్పెషల్ గా కొన్ని రంగులు మాత్రమే నచ్చుతాయి. అవి తప్పితే మరో రంగు ఎంచుకోవడానికి కూడా వీరు పెద్దగా ఆసక్తి చూపించరు. మరీ ముఖ్యంగా వీరు ఎక్కువగా నలుపు రంగు ని ఎక్కువగా ఇష్టపడతారు.
8.వృశ్చిక రాశి.. ఈ రాశివారికి ఫ్యాషన్ దుస్తులు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారు చాలా ధైర్యంగా ఉంటారు. బోల్డ్ గా ఎలాంటి దుస్తులు వేసుకోవడానికి అయినా రెడీగా ఉంటారు.
9. ధనస్సు రాశి..మ్యాచింగ్ దుస్తులు వేసుకోవడానికి ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి క్యాజువల్ డ్రెస్ లు కూడా ఎట్రాక్టివ్ గా ఉటారు.
10.మకర రాశి..ఈ రాశివారు కంఫర్ట్ కి ఎక్కువగా ఇష్టపడతారు. పెద్దగా ఛాయిస్ ఏమీ ఉండదు.
11. కుంభరాశి..ఈ రాశివారికి తెలుపు ఎక్కువగా ఇష్టపడతారు. ట్రెడిషనల్ అయినా.. ట్రెండీ అయినా.. లైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. లైట్ కలర్స్ , లైట్ జ్యువెలరీ నే వీరు ఎక్కువగా ఇష్టపడతారు.
12.మీన రాశి..కాటన్ దుస్తులను ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. మ్యాచింగ్ కూడా ఎక్కువగా ఇష్టపడతారు. దుస్తుల విషయంలో వీరు ఎక్స్పర్మెంట్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు.