మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో నిదానంగా అలోచించి నిర్ణయాలు తీసుకొనుట అవసరం. విజయ అవకాశములు స్వల్పం. పనిభారం పెరిగి సతమతమవుతారు. నిరాశ కలిగించే సంఘటనలు ఎదురగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఆశించిన విధంగా ఉండదు. సొంత ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. ఉద్యోగం ఆశిస్తున్న వారికి కష్టం మీద శుభవార్త. తృతీయ వారం సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం. 10, 14, 29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారాలకు అనుకూలమైనవి కావు. రావలసిన ధనం ఆలస్యంగా లభిస్తుంది.ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ప్రతికూలతలు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది. తలపెట్టిన పనులలో దైవ ఆశీస్శులు అవసరం. అనుభవజ్ఞుల సలహాలు కోరుట మంచిది. ప్రభుత్వ సంబంధ పెద్దల వలన సమస్యలు ఎదుర్కొందురు. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు పొందుతారు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్య రూపం దాల్చవు. అవకాశములు చేజారినా మంచిదే అనే భావన పెమ్పొందిన్చుకోనుట అవసరం. సంతాన విద్యాభ్యాసం మాత్రం సంతృప్తిని కలుగ చేస్తుంది. ఈ మాసంలో 5,9,10,26 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో గృహంలో శుభ కార్యక్రమాలు , సంతోష కార్యములు నిర్వహిస్తారు. చక్కటి మానసిక ప్రశాంతత లభించును. నూతన పరిచయాలు దీర్హకాలిక బంధాలకు దారితీయును. ధనాదాయం లో పెరుగుదల ఏర్పడును. వివాహాది విషయములకై తీవ్రంగా చర్చలు జరుపవలసి వచ్చును. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. ఉన్నత అధికారుల వలన ప్రతిభంధాకలు ఏర్పడును.రోజువారీ వ్యయం కూడా పెరుగును. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారములో వివాదములు ఏర్పడు సూచన. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఇష్టమైన వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. అయితే ఆశించిన విధంగా ధనాదాయం ఉండదు. సంతానం వలన సౌఖ్యత అనుభవిస్తారు. నిర్ణయాలలో జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం పొందుటకు సూచనలు ఉన్నవి. నూతన వ్యవహారాలు ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. 16,17,18 తేదీలలో గౌరవ హాని సూచన. మాసాంతంలో ప్రయాణ మూలక వ్యయం అధికమగుట మరియు ఆరోగ్య భంగములకు కూడా సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో ధనాదాయం ఆశించిన విధంగా ఉండును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి. పితృ వర్గీయుల ఆదరణ మరియు ప్రేమ పొందుదురు. మిత్రుల వలన ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు లభించును. అవివాహితులకు కూడా శుభవార్త లభించును. తృతీయ వారంలో ధైర్య సాహసములు పనికిరావు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కష్టానికి తగిన ఫలితం లభించదు. ఈ వారంలో ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం అగును. ఈ మాసంలో 4, 9, 17, 20, 26 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును.వినోద కార్యక్రమాలలో పాల్గోనేదురు.అయితే కుటుంబ సభ్యులతో అపార్ధాలకు సూచనలు ఉన్నవి. మీ భావాలూ స్పష్టంగా ప్రకటించడం మంచిది. వస్త్ర, గృహ, ధన లాభములు పొందుతారు. ఋణ బాధలు తొలగి మానసికంగా ఆనందకరమైన వాతావరణం. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన మంచి బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం పై అనుమానాలు ఏర్పడతాయి. 21 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధన రాబడి బాగుండును. సంతానం వలన చక్కటి సౌఖ్యత అనుభవిస్తారు. వారితో సమయం గడపగలుగుతారు. తలపెట్టిన శుభకార్య వ్యవహారములు బంధు మిత్రుల ఆదరణ వలన పూర్తి చేయగలరు. వ్యాపార వ్యవహారములు సామాన్యంగా కొనసాగును. మాస మధ్య కాలంలో వ్యాపార ఆదాయం పెరుగును. తృతీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంలో అనేక అవాంతరములు ఎదురగును. మాతృ వర్గీయులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మాసాంతంలో విదేశాలలో ఉన్నవారి సహకారం వలన నూతన వస్తువులు అమర్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో వివాధ అవాంతరములను, ఇబ్బందులను కలిగించును. ఉద్యోగ జీవనంలోని వారికి ఉద్యోగ నష్టము ఏర్పడుతుంది. దేనిని దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక ప్రణాళికలు రూపొందించుకోవాలి. జీవిత భాగస్వామితో కుటుంబ నిర్వహణ పరమైన విభేదాలుమానసిక అశాంతి ఏర్పరచును. సొంత మనుష్యుల వలననే గౌరవ హాని ఎదుర్కొంటారు. వృధా ప్రయత్నాలు భాదించు సూచన. మాసాంతంలో భవిష్యత్ గురించిన అనవసర భందోళనలు ఉండగలవు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో కొంత అనుకూలంగానే ఉండును. ఆదాయం సామాన్యంగా ఉండును. ఆశించిన విధంగా నిల్వ ధనం ఏర్పరచుకోగలరు. పెట్టుబడులు, శ్రమ వృధా కావు. చాకచక్యత ప్రదర్శిస్తారు. మీ వ్యతిరేకులు మీకు సన్నిహితంగా నటించి ధన సహాయం అర్దిస్తారు.వారిని అతిగా నమ్మి హామీలు ఇవ్వకూడదు. ఈ మాసంలో 3,16,17,25,26 తేదీలు ఎదో తెలియని వెలితి వెన్నాడుతుంది.ఆందోళన చెందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ప్రతీ కార్యం విజయం పొందును. బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టముల నుండి బయట పడుడురు. రావాల్సిన ధనం చేతికి లభించును. కోర్టు వ్యవహారములలో అనుకూల ఫలితాలు. అనారోగ్య సమస్యలనుండి చాలా వరకూ ఉపశమనం పొందుతారు. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూలత ఏర్పరుస్తుంది. మీ చేతిపై పుణ్య కార్యములు అమలగును . ఈ మాసంలో 5,9,17,26 తేదీలలో కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో వ్యపారాదులలో , ఉద్యోగ జీవనంలో ఉత్సాహం లభిస్తుంది. పదోన్నతి పొందడానికి అవకాశాలు ఉన్నవి.. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగును. పోటీదారుల పై విజయం ఏర్పడుతుంది. ఈ మాసంలో 11,12,13,14 తేదీలలో వ్యాపారములు లాభదాయకంగా కొనసాగును. మాసాంతంలో ఉద్యోగ జీవనంలో చక్కటి ఉన్నతి. ఈ మాసం 29,30 తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు పొందుదురు. వృత్తి వ్యాపారములలో లాభం పొంది ఆర్ధిక ఋణములు తీర్చివేస్తారు. తలచిన ప్రతీ ఆర్ధిక కార్యం విజయం పొందును. రావలసిన ధనం చేతికి వచ్చును. తృతీయ వారములో కళత్ర వర్గం వారితో వైరం భాదిస్తుంది. వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంతగా మంచిది కాదు. ఈ మాసంలో 7,8,9 తేదీలలో ఆదాయం బాగుండును. శుభవార్తలు లభిస్తాయి ఈ మాసంలో 19, 20, 21, 22 వ తేదీలు అంతగా అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.