
ఎవరు నమ్మినా.. నమ్మకున్నా మనిషి ఆనందంగా జీవించాలన్నా.. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలన్నా.. వారికి డబ్బు, ఆరోగ్యం తోడు ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకున్నా కూడా కష్టమే. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి.. ఈ రెండు చాలా ముఖ్యం. మన దగ్గర డబ్బు ఉంటే.. ఏదైనా చేయగలం అని చాలా మంది చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు. అయితే.. ఆ డబ్బుతో పాటు.. ఆరోగ్యం కూడా సొంతమైతే.. మరింత ఆనందంగా ఉంటుంది. అయితే.. అసలు ఏ రాశివారికి ఈ డబ్బు, ఆరోగ్యం ఎప్పుడూ అండగా ఉంటాయో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
1.మేష రాశి..
మేష రాశివారు చాలా బలంగా ఉంటారు. విధుల నిర్వహణలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా అంకిత భావంతో పనిచేస్తారు. కష్టపడి పనిచేస్తారు కాబట్టి.. వీరికి వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది. వీరికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అన్ని అవకాశాలు లభిస్తాయి.
2.వృషభ రాశి..
ఈ రాశివారు.. తమ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడతారు. తద్వారా వారు సౌకర్యవంతమైన జీవన శైలిని కలిగి ఉంటారు. వీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అయితే.. సంపాదన మొత్తం విపరీతంగా ఖర్చు చేస్తారు. వీరు ఎక్కువ విలాసవంతమైన జీవనాన్ని కోరుకుంటారు. వారు సంపాదించే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు.
3.మిథున రాశి..
వీరు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. వీరు ఎక్కువ సార్లు డబ్బు విషయంలో అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. వీరు తొందరగా లక్ష్యాలను సాధించలేరు. వీరు అంత తొందరగా డబ్బు సంపాదించలేరు.
4.కర్కాటక రాశి.
వీరికి టాలెంట్ ఉంటుంది కానీ.. బద్ధకం ఎక్కువ. దాని వల్ల త్వరగా పనిచేసి డబ్బు సంపాదించలేరు. నిదానంగా చేస్తారు. దీని వల్ల ఉన్నత లక్ష్యాలను చేరుకోలేక డబ్బు సంపాదనలో వెనకపడిపోతుంటారు.
5.సింహ రాశి..
వీరు ప్రతి పనినీ ముక్కుసూటిగా చేస్తారు. ప్రతి విషకయంలోనూ ముందుగా ఉంటారు. ఉత్తమ సామర్థ్యాలతో పనిచేస్తారు. వారసత్వ సంపాదన ఎక్కువగా ఉంటుంది. వీరికి దూకుడు ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
6.కన్య రాశి..
వీరికి డబ్బు ఎలా ఆదా చేయాలో బాగా తెలుసు. చాలా తెలివిగా మేనేజ్ చేస్తారు. వీరి కాలిక్యులేషన్ ఎక్కడా తప్పదు. తమ సంపాదనతోపాటు.. ఇతరులు డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో కూడా వివరిస్తారు. తక్కువగా ఖర్చు పెడుతూ.. విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉంటారు.
7. తుల రాశి.
వీరు ఎవరినైనా తమ మాటలతో ఆకర్షించగలరు. వీరు ఎక్కువ కష్టపడకున్నా.. తెలివిగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వీరికి వారసత్వ సంపద ఎక్కువగా లభిస్తుంది.
8. వృశ్చిక రాశి..
వీరు చాలా కష్టపడతారు. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కోసం అత్యుత్సాహంతో పనిచేస్తారు. వీరికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఓ క్లారిటీ ఉంది. వీరు ఎంత సంపాదించినా.. ఖర్చు మాత్రం చాలా తక్కువగా పెడుతుంటారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి తల్లిదండ్రుల నుంచి డబ్బు, ఎస్టేట్స్ వారసత్వంగా పొందుతారు. అయితే.. అది ఎక్కువ ఖర్చులకే సరిపోతుంది. విడిగా స్వతంత్రంగా సంపాదించినదంతా ఖర్చు అయిపోతుంది.
10.మకర రాశి..
వీరికి కష్టపడటం మాత్రమే తెలుసు. చిన్నతనం నుంచే వారు పెట్టుకున్న లక్ష్యానికి ఎలా చేరుుకోవాలో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వీరికి లక్ష్మీ కటాక్షం ఎక్కువ. దాని కోసం చిన్నతనం నుంచి కష్టపడతారు. చిన్నప్పటి నుంచి కష్టపడినా.. పెద్దగా అయిన తర్వాతే వీరికి ఆర్థిక లాభం చేకూరుతుంది. కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది.
11. కుంభ రాశి..
ఈ రాశివారు చాలా వినయంగా, దయగా ఉంటారు. అందరికీ గౌరవం ఇస్తారు. బంధాలను ఎక్కువగా కాపాడుకుంటూ ఉంటారు. వీరు కూడా ఎక్కువగా సంపాదిస్తారు. వీరు చాలా తెలివి ఎక్కువ. సరైన మార్గంలో మంచి నిర్ణయాలు తీసుకొని సమర్థవంతంగా డబ్బు సంపాదించుకోలుగుతారు.
12.మీన రాశి..
వీరు తెలివైన నిర్ణయాలు తీసుకోలేరు. డబ్బును ఎలా నియంత్రించాలో తెలియక.. ఎవరైనా మార్గదర్శకం చేయకపోతారా అని ఎదురు చూస్తుంటారు.