ఈ రాశుల గురించి భయంకరమైన నిజాలు.. మనసులో ఏమనుకుంటున్నారో కూడా..!

First Published Aug 25, 2021, 1:10 PM IST

నాణేనికి రెండు వైపులు ఎలా ఉంటాయో.. మనిషిలోనూ రెండు కోణాలు ఉంటాయి. ఒకటి బయకు కనిపించేది అయితే.. మరొకటి మనసులోది. 

ఒక్కో మనిషి ఒక్కోలా ప్రవర్తిస్తాడు. కొందరు.. అందరితో మంచిగా ఉంటారు. మరికొందరు.. ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూనే ఉంటారు. అయితే.. ప్రతి ఒక్క మనిషిలోనూ మనకు తెలీయని మరో మనిషి ఉంటాడట.  ఒక్క నాణేనికి రెండు వైపులు ఎలా ఉంటాయో.. మనిషిలోనూ రెండు కోణాలు ఉంటాయి. ఒకటి బయకు కనిపించేది అయితే.. మరొకటి మనసులోది. ఆ లోపల మనిషి ప్రవర్తనే నిజమైనదట. బయటకు వారు మనతో మంచిగా నటిస్తూ ఉండొచ్చు. కానీ లోపల మనిషి లో ధ్వేషం ఉండొచ్చు.  అసలు.. మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు. వారి నిజస్వరూపం ఏంటో.. వారి రాశుల ప్రకారం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

1.మేష రాశి..
 ప్రతి మనిషిలోనూ రెండు షేడ్స్ ఉన్నట్లు.. మేష రాశివారు కూడా రెండు రకాలుగా ప్రవర్తిస్తారు. ఒకవైపు వీరు  చాలా పట్టుదలతో ఉంటారు. లక్ష్యాలను చేరుకోవడం కోసం ఎంతటి సాహసమైనా చేస్తారు. పరసరాలను ప్రేమిస్తారు. ఇదే రాశివారు మరోవైపు వీరికి  చాలా కోపం ఎక్కువ. అందరినీ డామినేట్ చేయాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కోపం తెచ్చుకుంటారు.
 

2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా స్టేబుల్ గా ఉంటారు. కమిట్మెంట్ కూడా ఎక్కువ.  కష్ట సమయంలో తమను ఓదార్చడానికి ఎవరైనా ఉంటే బాగుండని కోరుకుంటారు. తమ లక్ష్య సాధన కోసం చాలా కష్టపడతారు. ఇక మరో కోణంలో వీరు చాలా మొండివారు. తాము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని భావిస్తుంటారు. ఇతరులు చెప్పేది మంచైనా వినిపించుకోవాలని అనుకోరు.

3.మిథున రాశి..
ఈ రాశివారిలో ద్వంద్వ వైఖరి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు. మరోవైపు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తారు. వీరికి సాహాసాలు  చేయడం ఇష్టం. ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.. మరోవైపు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. బాధలో ఉన్నవారు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా నమ్మకంగా ఉంటారు. చాలా సున్నితంగా ఉంటారు. తమ గురించి ఎవరిముందైనా ఓపెన్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటారు. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.  మరోవైపు వీరు త్వరగా డిప్రెషన్ కి గురౌతుంటారు.
 


5.సింహ రాశి..
ఈ రాశివారికి ప్రజాదారణ పొందడం ఎక్కువగా ఇష్టం. శ్రద్ధ, కీర్తిని ఇష్టపడతారు. చాలా సార్లు ఉదారంగా ప్రవర్తిస్తుంటారు. మరోవైపు ఒక్కోసారి చాలా స్వార్థంగా ప్రవర్తిస్తుంటారు.

6.కన్యా రాశి..
ఈ రాశివారు ప్రతి విషయాన్ని క్షున్నంగా ఆలోచిస్తుంటారు.  ఇదే లక్షణం వారిని ఉన్నత స్థాయికి చేర్చడానికి సహాయం చేస్తుంది.  ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలుగుతారు. మరోవైపు కొన్ని చిన్న చిన్న విషయాలనే చాలా పెద్ద వాటిలా భావించి లేని పొని తల భారం పెంచుకుంటారు.

7. తుల రాశి..
ఈ రాశివారు చాలా ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.  అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని అనుకుంటారు. అయితే.. ఈ క్రమంలో..  కొన్ని విషయాల్లో చాలా పిరికితనంగా వ్యవహరిస్తారు.
 

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. చాలా నమ్మకంగా ఉంటారు. దయగల వ్యక్తులు.  చుట్టూ ఉన్నవారందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే... ఒక్కసారి తమను ఎవరైనా మోసం చేశారని తెలిస్తే.. పగ తీర్చుకోకుండా ఉండలేరు. వారిలోని మంచితనమంతా సచ్చిపోతుంది.

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ప్రయాణాలు, సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను చూడాలని అనుకుంటారు.  మరోవైపు వీరు ఇచ్చిన ప్రామిస్ లను నెరవేర్చరు. చాలా అనూహ్యంగా కొత్త గా , వింతగా ప్రవర్తిస్తుంటారు.

10.మకర రాశి..
ఈ రాశివారు తమ ఆశయాలను సాధించడానికి ముందుంటారు. వృత్తి పరమైన వృత్తిలో  ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతారు. గొప్ప నాయకులు కూడా అవుతారు. కానీ.. మరోవైపు వీరికి అహంకారం ఎక్కువ. ప్రగల్బాలు పలుకుతూ ఉంటారు. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని రెండింటినీ సమతుల్యం చేసుకోలేరు. 

11.కుంభ రాశి..
ఈ రాశివారు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ని కలుస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అందరినీ ప్రేమిస్తారు. మరోవైపు వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇబ్బంది కరంగా.. బాధించేలా ఉంటాయి.

12.మీన రాశి..
ఈ రాశివారు చాలా మంచిగా ఉంటారు. చాలా సున్నితంగా ఉంటారు. బాధలో ఉన్నవారిని ఓదార్పు ఇస్తారు. అయితే. మరో వైపు వీరికి రియాల్టీ అర్థం కాదు. వారు ఊహించిందే నిజమని నమ్ముతుంటారు. అబద్ధపు జీవితంలో బతికేస్తూ ఉంటారు. వాస్తవంలో బతకడానికి ఇష్టపడతారు. 

click me!