నమ్మక ద్రోహం చేసే రాశులు ఇవి.. వీరితో జర జాగ్రత్త..

First Published | Mar 31, 2024, 1:34 PM IST

జ్యోతిష్యం ప్రకారం.. మన రాశిచక్రాన్ని బట్టి మన ప్రవర్తణ ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారు అన్ని విధాలా మంచి వారే అయినా కొన్ని కారణాల వల్ల ఇతరులకు నమ్మక ద్రోహం చేస్తారు. ఏయే రాశులవారంటే?

స్నేహితులు కానీ, భాగస్వాములు కానీ నమ్మిన వారు కానీ.. మనకు నమ్మక ద్రోహం చేస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎవ్వరైనా సరే ద్రోహం చేసిన వారిని అంత తేలిగ్గా మర్చిపోరు. అలాగే వారిని జీవితంలో క్షమించరు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాశిచక్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఇతరులకు ద్రోహం చేస్తారు. వాళ్లు ఎవరెవరంటే? 
 

మిథున రాశి

మిథున రాశివాళ్లు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అట్రాక్టీవ్ గా, చాలా తెలివిగా ఉంటారు. అలాగే వీళ్లు విభిన్న పరిస్థితులకు కూడా ఇట్టే అలవాటు పడతారు. ఈ లక్షణాల వల్ల వీళ్లు  ఉద్దేశపూర్వకంగా ఇతరులకు ద్రోహం చేయొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు వారిపై మనకు నమ్మకాన్ని పెంచుతాయి. కానీ వీళ్లు తమకు తెలిసిన వారికే నమ్మక ద్రోహం చేయొచ్చు. 
 


Sagittarius


ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు సాధారణంగా సాహసోపేతమైన, స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. అన్నింటికంటే తమ స్వేచ్ఛకే ఎక్కువ విలువనిస్తారు. ఇది అందరూ మెచ్చుకోదగ్గ విషయమే అయినప్పటికీ.. బంధించబడతారనే వారి భయం కొన్నిసార్లు నమ్మకద్రోహానికి దారితీస్తుంది. కొత్త అనుభవాలను అన్వేషించడానికి వీళ్లు బాగా ఇష్టపడతారు. దీనివల్ల కలిగే పర్యవసానాలను వీళ్లు గుర్తించరు. ధనుస్సు రాశి వారు అనుకోకుండా తమకు దగ్గరగా ఉన్నవారిని ఎంతో బాధపెడతారు.
 

Image: Pexels

వృశ్చిక రాశి 

ఈ రాశివారు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇది వారి బలం, బలహీనత. ఈ రాశుల వారు తమ గురించి శ్రద్ధ వహించే వారికి చాలా నమ్మకంగా ఉటారు. అయినప్పటికీ.. వీరి భావోద్వేగాలు, బలహీనత భయం వారిని ఆత్మరక్షణ సాధనంగా ఇతరులకు ద్రోహం చేయడానికి ప్రేరేపిస్తాయి. వృశ్చిక రాశి వారి రహస్య స్వభావం వారి ఒరిజినాలిటీ గురించి తెలుసుకోకుండా చేస్తుంది. కానీ ఇది అపార్థాలు, నమ్మకద్రోహాలకు దారితీస్తుంది.

కుంభ రాశి 

కుంభరాశివారు దార్శనికులు. వీళ్లు వినూత్న ఆలోచనలు కలిగి ఉంటారు. అయినప్పటికీ ఇతరులతో వీరు అంత చనువుగా ఉండరు. వారితో ఫ్రీగా ఉండలేరు. ఇది కొన్నిసార్లు నమ్మకద్రోహానికి దారితీస్తుంది. కుంభరాశి వారు భావోద్వేగాల కంటే ఆలోచనలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే వీరు భావోద్వేగ కనెక్షన్ కోసం చూస్తున్న వారికి నమ్మక ద్రోహం చేస్తారు. 
 

మీన రాశి 

మీనరాశివారు కరుణ, సానుభూతిని కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్లు ఎక్కువగా వారి ఫాంటసీ ప్రపంచంలోనే  ఓదార్పును పొందుతారు. గొడవలు రాకుండా చేసే వీళ్ల ధోరణి కొన్నిసార్లు నమ్మకద్రోహానికి దారితీస్తుంది. సామరస్యాన్ని కాపాడుకోవాలనే ఈ రాశి వారి కోరిక నమ్మకద్రోహానికి దారితీస్తుంది.
 

మేష రాశి

ఈ రాశివాళ్లు చాలా ధైర్యవంతులు. అలాగే మంచి దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. వీరు తమ లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారు. వీరికున్న నాయకత్వ లక్షణాలు సమాజంలో మెచ్చుకోవడతాయి. కానీ వీరి హఠాత్తు స్వభావం కొన్నిసార్లు నమ్మకాన్ని ద్రోహం చేయడానికి దారితీస్తుంది. ఇతరుల మనోభావాల కంటే తమ స్వప్రయోజనాలకే వీరు ప్రాధాన్యతనిస్తారు. 
 

Latest Videos

click me!