Your Weekly Horoscopes: ఓ రాశివారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది

First Published | Mar 31, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.   వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.దూర ప్రయాణాలు వల్ల లాభాలు పొందుతారు.ఆధ్యాత్మిక చింతన.దైవ కార్యాలు లో పాల్గొంటారు.
 

వార ఫలాలు  : 31-03-24  నుండి 6-04-24   వరకు
 
 
 జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఆచితూచి మాట్లాడ వలెను.శారీరకంగా మానసికంగా బలహీన పడతారు.మానసిక  ఆందోళన గా ఉంటుంది. బంధువులు తో మనస్పర్థలు రాగలవు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.దురాలోచనలు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలు తగ్గించుకోవాలి.కుటుంబ సభ్యుల తో సఖ్యత గా మెలగాలి.స్వయం వృత్తి వారికి సామాన్యంగా ఉంటుంది.వ్యాపారంలో పెట్టుబడి వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు.కొన్ని సంఘటనల వలన భయాందోళనలు చెందుతారు. మీరు నమ్మిన వారి వలనే మోసగించ బడతారు.కుటుంబం నందు ప్రతికూలత.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

శారీరిక మానసిక అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో  అభిప్రాయ భేదాలు రాగలవు.అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించడం కష్టం గా ఉండును. తలచిన పనులు లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు స్తబ్దత ఏర్పడి ఇబ్బందులు గురి అవుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఇతరులతో చిన్న చిన్న వివాదాలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు యొక్క ఆగ్రహానికి గురి కావచ్చు ‌. ఊహించని రీతి గా అధిక ఖర్చులు.అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకొనవద్దు

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఉద్యోగాలలో అధికారులు యొక్క ఆదరణ పొందుతారు.ఆర్థికంగా లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.వచ్చిన అవకాశాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు.యంత్రాల యందు వాహనాల యందు జాగ్రత్త అవసరం.సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.ధనాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. అకారణ కోపం చేత తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.దూర ప్రయాణాలు వల్ల లాభాలు పొందుతారు.ఆధ్యాత్మిక చింతన.దైవ కార్యాలు లో పాల్గొంటారు.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన వాతావరణం. ప్రభుత్వ సంబంధిత పనుల్లో పురోగతి సాధిస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక.రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి.రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అవును.నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు.కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
చేయు పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. సంఘంలో ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా గొడవలు. శారీరక గాయాలు ప్రమాదాలు జరిగే అవకాశం.భూ గృహ నిర్మాణ పనులు వాయిదా వేయడం మంచిది. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అధికమైన ఖర్చు. కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్థలు. అవమానాలు అపనిందలు రాగలవు.జాగ్రత్త వహించడం మంచిది.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.కుటుంబసభ్యులతో వివాదాలు.మానసిక అశాంతి. ఆర్థిక లావాదేవీలు లో జాగ్రత్తలు తీసుకోవాల.ఉద్యోగాలలో చికాకులు. మానసికంగా బలహీనంగా ఉంటుంది.చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు.‌ మాతృవర్గం తో విరోధాలు ఏర్పడవచ్చు. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఊహించని వివాదాలు చోటు చేసుకోవచ్చు.ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.మిత్రులు శత్రువులు గా మారే అవకాశం. వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలించును.కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధువర్గం నుండి ఆహ్వానం అందుతుంది.గత కొంతకాలంగా ఉన్న ఆలోచనలు కార్యాచరణలో పెడతారు.వ్యాపార అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.అన్ని వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రావలసిన సొమ్ము అందుతుంది.వివాదాలు నుంచి బయటపడే అవకాశం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం కలుగును.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఉద్యోగాలలో అధికారుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అధిక ఖర్చులు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చికాకులు కలిగిస్తాయి.సన్నిహితులతో అనవసరమైన కలహాలు రావచ్చు.గృహ నిర్మాణ ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది.సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలు కలుగును.ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.చెడు సావాసాలు కు దూరంగా ఉండాలి.మానసిక ఆందోళన పెరుగుతుంది.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.కొంత మేర రుణాలు చేయవలసి వస్తుంది. రుణ రోగం శత్రు బాధలు పెరుగుతాయి.ఉద్యోగ వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి.కుటుంబంలో ప్రతికూల వాతావరణం.సహోద్యోగులతో మనస్పర్థలు రాగలవు.అధికారుల నుంచి ఒత్తిడి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఆదాయానికి మించిన ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
శుభవార్త అందును.ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురైనా చివరకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలు అందుకుంటారు.రుణ బాధలు తగ్గి ప్రశాంతత లభించును. సంఘము నందు నూతన పరిచయాలు ఏర్పడగలవు. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడపగలరు.విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు.ఉద్యోగాలలో విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు.కీలకమైన సమస్య పరిష్కార మగును.ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.నూతన వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.ఆర్థిక విషయాలలో అభివృద్ధి సాధిస్తారు.గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.దంపతుల మధ్య సదవగాహన ఏర్పడుతుంది.విద్యార్థులు విద్య యందు రాణిస్తారు.ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలించును.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
చేయు పనుల్లో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఏర్పడగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోని రీతిలో ఇబ్బందులు.భూ గృహ క్రయ విక్రయాలు లో జాగ్రత్త అవసరం.కోర్టు న్యాయ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా తీర్పు రావచ్చు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఆదాయ మార్గాలు ధన ఆలోచన చేస్తారు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించును.కుటుంబసభ్యులతో వివాదాలు రాగలవు.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆరోగ్యపరంగా చికాకులు.దైవ దర్శనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పట్టుదలతో చదవవలెను.ఆదాయానికి మించిన ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మొండి బాకీలు వసూలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.అనవసరమైన ప్రయాణాలు.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఉద్యోగయత్నాలు లో కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.వస్తు ఆభరణాలను వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలం.ఉత్సాహంగా గడుపుతారు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.పనులు సకాలంలో పూర్తి అగును. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.విద్యార్థుల ప్రతిభ కనబరుస్తారు.చిన్ననాటి మిత్రుల తో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలించును.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.సంతానం అభివృద్ధి ఆనందం కలుగుతుంది.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి.పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేయు వ్యవహారాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Latest Videos

click me!