1.మేష రాశి- సింహ రాశి...
మేష రాశి, సింహ రాశిలు బేసికల్ గా... చాలా స్ట్రాంగ్ , పవర్ ఫుల్ రాశులు. వీరికి వ్యక్తిగతంగా వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అయితే.. ఈ రెండు రాశులు తోబుట్టువులు అయితే.. ఇద్దరికీ ఈగోలు చాలా ఎక్కువ. ఒకరికొరు తగ్గకుండా వాదించుకుంటూనే ఉంటారు. అయితే.. ఇతరులు మాత్రం తమ తోబుట్టువు జోలికి వస్తే ఒప్పుకోరు. ఒకరినొకరు రక్షించుకుంటారు. ఈ రెండు రాశుల వారు తమ తోబుట్టువులపై ప్రేమను చూపించగలరు, కోపాన్ని చూపించగలరు.