Zodiac sign: ఈ రాశివారికి చెడు వార్తలు చెప్పాల్సి వస్తే...!

Published : Aug 11, 2022, 12:33 PM IST

కొందరు చెడు వార్త వినగానే కూలపడిపోతారు. కొందరు  భయపడిపోతూ ఉంటారు. అందుకే.. ఎవరికైనా చెడు వార్తలు చెప్పాలంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే..  ఏ రాశివారికి చెడు వార్తలను ఎలా చెప్పాలో ఓసారి చూద్దాం.

PREV
113
 Zodiac sign: ఈ రాశివారికి చెడు వార్తలు చెప్పాల్సి వస్తే...!

చెడు వార్తలు వినాలని ఎవరూ కోరుకోరు. కానీ..జీవితం అలానే ఉంటుంది. ప్రతిసారీ మనకు మంచి మాత్రమే జరగదు. అప్పుడప్పుడు ఊహించని విధంగా.. చెడు కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే.. ఆ చెడును ఎవరూ సులభంగా తీసుకోలేరు. కొందరు చెడు వార్త వినగానే కూలపడిపోతారు. కొందరు  భయపడిపోతూ ఉంటారు. అందుకే.. ఎవరికైనా చెడు వార్తలు చెప్పాలంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే..  ఏ రాశివారికి చెడు వార్తలను ఎలా చెప్పాలో ఓసారి చూద్దాం.

213

1.మేష రాశి...
ఈ రాశివారు.. ఏవిషయాన్నైనా విని తట్టుకోగలరు. అందుకే.. వీరు ఏ విషయాన్ని అయినా నేరుగా వినాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారికి ఏదైనా చెడు వార్త చెప్పాల్సి వస్తే.. నేరుగా చెప్పేయండి.

313

2.వృషభ రాశి..

ఈ రాశివారు.. కాస్త చెడు వార్తలను నేరుగా వింటే తట్టుకోలేరు. కాబట్టి.. వీరికి ఏదైనా విషయం చెప్పేటప్పుడు  కాస్త ఆలోచించాలి. నేరుగా ఎవరుపడితే వారు చెప్పకుండా.. ప్రియ మిత్రులు, ఆప్తులు ఎవరైనా పక్కన కూర్చొని.. పరిస్థితికి వారిని సిద్దం చేసి.. ఆ తర్వాత వారికి ఆ విషయం చెప్పాలి. అప్పుడు వారికి అది మరీ షాకింగ్ గా అనిపించకపోవచ్చు.

413

3.మిథున రాశి..

ఈ రాశి వారితో కాస్త సున్నితంగా ఉండండి. వారి ప్రియమైన వ్యక్తి మరణించినప్పటికీ  ఆ విషయాన్ని వారికి నేరుగా చెప్పకూడదు. ఏదో తప్పు జరిగిందని వారికి తెలియజేయండి. ప్రాణం పోయిందని వెంటనే చెప్పకుండ.. ఆరోగ్యం బాలేదోనో ఇంకేదో చెప్పి.. వారు స్థిమిత పడిన తర్వాత.. మృదువుగా, నిదానంగా వారికి చెడు వార్తను తెలియజేయాలి. 

513

4.కర్కాటక రాశి...

ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. కానీ ఏదైనా బాధ కలిగినప్పుడు మాత్రం తట్టుకోగలరు. కాబట్టి.. వీరికి చెడు వార్త అయినప్పటికీ నేరుగా చెప్పేయవచ్చు. వారికి మరో ఆప్షన్ అంటూ ఏదీ లేదు. ఎందుకంటే వీరికి వెంటనే చెప్పకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి.. వీరికి వెంటనే చెప్పేయాలి.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు అందరికీ చాలా కటువుగా కనిపిస్తారు. కానీ వీరు వెంటనే చెడు వార్తలను జీర్ణం చేసుకోలేరు. కాబట్టి.. వీరికి వెంటనే చెప్పకూడదు. ఆ వార్త పట్ల వారిని సెట్ చేయాలి. ఇలాంటి వార్త చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని మొదలుపెట్టి.. వారిని ఆ వార్తకు సిద్దం చేసి.. ఆ తర్వాత చెప్పాలి.
 

713

6.కన్య రాశి..

కన్య రాశివారు చెడు వార్తలు వినగానే చాలా ఒత్తిడికి గురౌతారు. కాబట్టి... వారికి వెంటనే చెప్పకూడదు. చాలా నిదానంగా... అంతా బాగానే ఉంది అని నమ్మిస్తూ.. మెల్లగా విషయాన్ని  చెప్పే ప్రయత్నం చేయాలి. లేదంటే.. వీరికి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది.
 

813

7.తుల రాశి..

మీరు వారితో నిజాయితీగా ఉండవచ్చు కానీ దాని గురించి స్పష్టంగా చెప్పకుండా వారిని ఓదార్చడానికి అక్కడ ఉండండి. బయటకు వారు భయంకరంగా ఉన్నా.. లోలోపల కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి వీరికి ధైర్యం చెప్పేవారు పక్కన ఉండటం అవసరం.
 

913

8.వృశ్చిక రాశి..

ఈ రాశివారికి చెడు వార్తను తెలియజేసే క్రమంలో మీరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ విషయాన్ని వెంటనే తెలియజేయకండి. ముందుగా క్షమాపణలు చెబుతూ విషయాన్ని తెలియజేయడం మొదలుపెట్టాలి. వారి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసి.. తర్వాత విషయాన్ని తెలియజేయాలి. 
 

1013

9.ధనస్సు రాశి..

తప్పు జరిగిందని వారు ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి దానితో ప్రారంభించండి. జరిగిన చెడును మార్చలేమనే విషయాన్ని వారికి తెలియజేయాలి. చెడు వార్తను భయంకరంగా కాకుండా... పదాలను సున్నితమైన వాటిని ఉపయోగించి చెప్పడం మంచిది.

1113

10.మకర  రాశి..

మీరు మృదువైన ప్రత్యక్ష విధానాన్ని తీసుకోవచ్చు. తక్కువ షాకింగ్ పదాలను ఉపయోగించండి. చెడు వార్తలను వారికి తెలియజేయండి. దానిని ఎలా తీసుకోవాలో వారికి తెలుసు. పరిస్థితులను వారు అర్థం చేసుకోగలరు.
 

1213

11.కుంభ రాశి..

ఎల్లప్పుడూ, వారికి ముందుగా శుభవార్త అందించి, ఆపై చెడు వార్తలను అందించండి. వారు భయాందోళనకు గురవుతారు కాబట్టి ఒక గ్లాసు నీళ్లను తీసుకెళ్లండి!

1313

12.మీన రాశి..

మీన రాశివారికి చెడు వార్తలు చెప్పినా.. వారు వెంటనే రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఓ శూన్యంలోకి వెళ్లినట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఎలా ఉన్నారు అనే విషయం వారి ముఖం చూస్తే అర్థమౌతుంది. వారికి కొంత స్పేస్ ఇవ్వాలి. వారు తేరుకునే వరకు వేచి ఉండాలి. అయితే.. వారి బాగోగులు తెలుసుకోకుండా మాత్రం ఉండకూడదు. 
 

click me!

Recommended Stories