సమయం దొరికితే ఏదో సరదాగా షాపింగుకో, షికారుకో, సినిమాకు, స్నేహితులతో గడపడానికో చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మాత్రం ఎంచక్కా ముసుగుతన్ని, గుర్రుపెట్టి నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే అది వాళ్ల తప్పుకాదట.. వారు పుట్టిన రాశి వారితో అలా చేయిస్తుందని చెబుతున్నారు ఆస్ట్రాలజర్స్.
ప్రతీరోజూ మనిషికి ఎంత నిద్ర అవసరం? అంటే.. 6 గంటల గాఢ నిద్ర శరీరాన్ని రీచార్జ్ చేస్తుంది. కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది సరిపోదు అనుకుంటే.. రోజుకు 7నుంచి 8ల వరకు నిద్ర పోతే ఇంకా సూపర్. రోజంతా అలిసిన శరీరం నిద్రలో స్వాంతన పొందుతుంది. శరీరంలోని అవయవాలన్నీ నూతనోత్తేజాన్ని నింపుకుంటాయి. అయితే కొంతమందికి నిద్ర అనేది చాలా పెద్ద విషయం.. 2,3 గంటలకు మించి పడుకోరు. ఇంకొంతమందికి నిద్రపోవడం అంటే.. ఎంతో ఇష్టం. ఏ కాస్త గ్యాప్ దొరికినా హాయిగా పడుకుని నిద్రపోతారు.
28
సమయం దొరికితే ఏదో సరదాగా షాపింగుకో, షికారుకో, సినిమాకు, స్నేహితులతో గడపడానికో చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మాత్రం ఎంచక్కా ముసుగుతన్ని, గుర్రుపెట్టి నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే అది వాళ్ల తప్పుకాదట.. వారు పుట్టిన రాశి వారితో అలా చేయిస్తుందని చెబుతున్నారు ఆస్ట్రాలజర్స్. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి కానీ, మీ బంధువుల, స్నేహితుల రాశులు కానీ ఉన్నాయేమో ఒక్కసారి చూడండి. ఈ సారి వాళ్లలా పడుకుంటే అపార్థం చేసుకోకుండా.. అర్థం చేసుకోండి.
38
సమయం దొరికితే ఏదో సరదాగా షాపింగుకో, షికారుకో, సినిమాకు, స్నేహితులతో గడపడానికో చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మాత్రం ఎంచక్కా ముసుగుతన్ని, గుర్రుపెట్టి నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే అది వాళ్ల తప్పుకాదట.. వారు పుట్టిన రాశి వారితో అలా చేయిస్తుందని చెబుతున్నారు ఆస్ట్రాలజర్స్. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి కానీ, మీ బంధువుల, స్నేహితుల రాశులు కానీ ఉన్నాయేమో ఒక్కసారి చూడండి. ఈ సారి వాళ్లలా పడుకుంటే అపార్థం చేసుకోకుండా.. అర్థం చేసుకోండి.
48
Representative Image: Aries
మేషం (Aries)
ఈ రాశిచక్రం ఉన్నవారు నిజానికి నలుగురితో బాగా కలిసిపోతారు. సోషల్ గా ఉంటారు. కానీ వీరికి రోజంతా నిద్రపోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ ఎప్పుడైనా నైట్ అవుట్ ప్లాన్ ఉందని తెలిస్తే.. ఆ నిద్రను పూరించడానికి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అంతేకానీ నిద్ర విషయంలో ఎప్పుడూ రాజీపడరు.
58
Representative Image: Taurus
వృషభం (Taurus)
వృషభ రాశివారు పనిచేయడానికి చాలా ఇష్టపడతారు. పని తరువాత వారికి అంత ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది ఏదైనా ఉందీ అంటే అది నిద్ర మాత్రమే. వీరి నిద్ర పిచ్చి ఎంతవరకూ ఉంటుందంటే.. వీరు కొన్నిసార్లు వారాన్ని పనిదినాలు, నిద్ర దినాలుగా వర్గీకరించుకుని మరీ పడుకుంటారు. ఇలా పడుకుంటే వారింకా ఉత్సాహంగా, ఉల్లాసంగా, శక్తివంతంగా తయారవుతారు. రోజులో ఏ టైంలోనైనా సరే ఇలా పడుకుంటే అలా నిద్రపోవడం వీరి ప్రత్యేకత.
68
Representative Image: Cancer zodiac
క్యాన్సర్ (Cancer)
కర్కాటక రాశివారు చాలా ఆలోచిస్తారు, చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి వీరు రాత్రిపూట నిద్రకంటే సాధారణంగా పగటిపూట నిద్రపోతారు. నిద్రపోవడం వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. కర్ణాటక రాశివారికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే వారు తమ నిద్రను కప్పిపుచ్చుకోగలుగుతారు.
78
Representative Image: Sagittarius
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశివారు సాహసోపేతంగా ఉంటారు. దీనివల్ల వారి నిద్ర చక్రం కాస్త తగ్గుతుంది. అయినప్పటికీ, వారు మిగిలిన సమయాన్ని ఆస్వాదించగలిగేలా ఎప్పుడైనా, ఎక్కడైనా పడుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
88
Representative Image: Pisces
మీనం (Pisces)
మీన రాశికి నిద్రంటే చాలా ఇష్టం! ఎంత ఇష్టం.. అంటే వారు ఎదుర్కునే ప్రతీ సమస్యకూ నిద్ర పోవడం వల్లే వారికి మార్గనిర్దేశం దొరుకుతుంది అనేంతగా.. వారు అలా బద్దకంగా పడి నిద్రపోవడంలో సిద్ధహస్తులు. నిద్రకోసం ఎంత ముఖ్యమైన కార్యక్రమాన్నైనా వాయిదా వేయగలరు.