ఈ రాశులవారు చాలా డేంజర్.. ముందు ఒకలా.. వెనక ఒకలా నటిస్తారు..!

Published : Jan 25, 2022, 11:06 AM IST

వీరు.. ఇప్పటి వరకు మనతో నటించారు అని తెలుసుకునే సరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా నటించేవారిని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దాం..

PREV
16
ఈ రాశులవారు చాలా డేంజర్.. ముందు ఒకలా.. వెనక ఒకలా నటిస్తారు..!
astrology

మీరు గమనించారో లేదో.. చాలా మంది.. మనతో ముందు ఒకలా.. ఆ తర్వాత మరోలా ప్రవర్తిస్తారు. మనకు పరిచయం అయిన కొత్తలో.. మనతో ఒకలా ఉండి.. ఆ తర్వాతర్వాత.. వారిలోని అసలు వ్యక్తిని బయటకు తీస్తారు. వీరు.. ఇప్పటి వరకు మనతో నటించారు అని తెలుసుకునే సరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా నటించేవారిని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దాం..

26

1.మిథున రాశి..
ఈ మిథున రాశివారికి రెండు ముఖాలు ఉంటాయి. అయితే.. వీరు ప్రతిదానికీ గందరగోళానికి గురౌతూ ఉంటారు. ఈ రాశివారు పరిచయం అయిన కొత్తలో.. ఎంతో అందంగా.. సరదాగా.. వీరితో ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో అనే రేంజ్ లో నటిస్తారు. కొంత కాలం తర్వాత.. పూర్తి విరుద్ధంగా కనపడతారు. వీరితో రెండు నిమిషాలు కూడా ఉండలేం అనేలా తయారౌతారు. వీరి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది.

36

2.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కూడా చాలా డేంజర్ అని చెప్పొచ్చు. వీరితో పరిచయం అయిన మొదట్లో మిమ్మల్ని.. మహారాజు, మహారాణిలా చూసుకుంటారు. మీరే ప్రపంచం అన్నట్లు.. మీతోనే , మీ చుట్టూనే తిరుగుతూ కాలం గడిపేస్తారు. ఇక కొంత కాలం తర్వాత.. చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు.  మొదట ఎలా ఉన్నారో.. దానికి విరుద్దంగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని అసలు పట్టించుకోను కూడా పట్టించుకోరు.

46

3.కన్య రాశి..

ఈ రాశివారు పరిచయం అయిన మొదట్లొ.. వీరంతా మంచివారు ఇంకొకరు ఉండరేమో అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొంత కాలం తర్వాత.. మీ పై విమర్శలు ఎక్కువౌతాయి. మిమ్మల్ని ప్రతి విషయంలో అనుమానిస్తూ.. విచిత్రంగా ప్రవర్తిస్తారు.

56

4.తుల రాశి..
ఈ రాశివారు కొంచెం భిన్నంగా ఉంటారు. చాలా మంది ముందు వారిలోని మంచిని చూపించి తర్వాత చెడు కోణాన్ని బయటపడెతారు. కానీ.. వీరు మాత్రం ముందుగా వీరిలోని స్వార్థ గుణాన్ని బయటపెడతారు. ఆ తర్వాత.. వీరి గురించి పూర్తిగా తెలుసుకుంటే గానీ.. వీరు ఎంత దయగల వ్యక్తో మనకు తెలిసి రాదు. పైకి కొంచెం కటువుగా కనిపించినా.. వీరి మనసు చాలా మంచిది. వీరిని అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది.

66

5.వృషభ రాశి..
ప్రారంభంలో వృషభం చాలా చక్కని వ్యక్తులు, కానీ చివరికి, మీరు వారి చీకటి కోణాన్ని చూస్తారు. వారు మొదట్లో చాలా ఓపికగా ఉంటారు. అలా మిమ్మల్ని నమ్మిస్తారు. కానీ.. తర్వాతర్వాత వారిలోని ఎమోషన్స్ ని బయటపెడతారు. చాలా భయంకరంగా కనిపించే అవకాశం ఉంది.

click me!

Recommended Stories