ఈ రాశులకు చెందిన పిల్లలకు తల్లిదండ్రులు కచ్చితంగా ఇవి నేర్పాలి..!

First Published Jan 22, 2022, 1:53 PM IST

అది మనం వారికి చిన్న తనం నుంచే అలవాటు చేయాలి. ముఖ్యంగా... ఈ కింద రాశి పిల్లలకు.. ఇతరులతో.. సఖ్యతగా ఎలా ఉండాలో నేర్పించడం చాలా అవసరం. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..
 

parents

పిల్లలకు.. చిన్నతనం నుంచి మంచి ఏదో.. చెడు ఏదో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత.అంతేకాదు.. అందరితో.. హెల్దీ బౌండరీలు ఏర్పరుచుకోవడం కూడా చాలా  అవసరం. అది మనం వారికి చిన్న తనం నుంచే అలవాటు చేయాలి. ముఖ్యంగా... ఈ కింద రాశి పిల్లలకు.. ఇతరులతో.. సఖ్యతగా ఎలా ఉండాలో నేర్పించడం చాలా అవసరం. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

1.మిథున రాశి..

మిథున రాశివారికి చెందిన పిల్లలు ఈ ఏడాది ఆరోగ్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంది. మామూలుగా  ఈ రాశి పిల్లలు.. డ్యూయల్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. మిథున రాశివారు కొంచెం బోల్డ్ గా ఉంటారు. ప్రతి విషయంలో ముందుకు దూసుకుపోతూ ఉంటారు. కాబట్టి.. వీరికి ముందు నుంచీ అడ్డుకట్ట వేడయం చాలా ముఖ్యం.ఇంత దూకుడుగా ఉంటే.. ఇతరులతో కలవలేరు. కాబట్టి.. వీరి విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 


2.కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి అందరినీ ప్రేమించడమే తెలుసు. ఇతరులను ద్వేషించడం అనే కాన్సెప్ట్ కూడా వీరికి నచ్చదు. ఇతరులతో విభేదాలు ఉన్నా కూడా వాదోపవాదాలను ఇష్టపడరు. అందరితో సంతోషంగా ఉండాలని .. అందరితోనూ తమ బంధం సజావుగా సాగాలని కోరుకుంటూ ుంటారు. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. వీరి విషయంలోనూ తల్లిదండ్రులు.. ఓ కంట కనిపెడుతూ.. వారు ఇదే మార్గంలో.. మంచిగా మెలిగేలా సహకరించాలి.
 

3.కన్య రాశి..
కన్య రాశి వారు భూమికి సంకేతం. వారు కఠినమైన క్రమశిక్షణ కలిగి ఉంటారు. చిన్నప్పుడు క్రమశిక్షణగా ఉన్నా.. వయసులోకి వచ్చిన తర్వాత.. ఆ క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వీరిని  కంట్రోల్ చేయడం ముందునుుచే మొదలుపెట్టాలి. పనికి రాని వాటికి.. ఆకర్షితులవ్వకుండా.. ముందు నుంచే.. వారికి ఏది మంచి.. ఏది చెడు అనే విషయాన్ని చెప్పాలి. ఒక బౌండరీ వారికి గీయాల్సి ఉంటుంది.

4.తుల రాశి..
ఈ రాశివారు.. చాలా ప్రేమగా ఉంటారు. అందరితోనూ చాలా మృదువుగా.. మర్యాదతో ప్రవర్తిస్తారు.  అందరితోనూ ఈ రాశి పిల్లలు ఆసక్తిగా.. ఉల్లాసభరితంగా ఉంటారు. కానీ వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కష్టపడతారు. ఎక్కువగా వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి.. వారికి ఈ విషయంలో బౌండరీలు క్రియేట్ చేయాలి. గొడవలకు వెళ్లకుండా.. వారికి మంచిని వివరించాల్సి ఉంటుంది.

5.మీన రాశి..
ఈ రాశివారికి అవగాహన చాలా ఎక్కువ. ఎవరినైనా ఇట్టే.. వీరు అర్థం చేసుకోగలరు.  తమకంటే ఇతరులకు ఎక్కువ ప్రాధన్యత ఇస్తూ ఉంటారు. ఇది ఒకింత మంచిదే అయినా.. ఇదే కంటిన్యూ అయితే.. పిల్లలు పెద్దైన తర్వాత.. తమకంటూ తాము విలువ ఇవ్వకుండా.. పక్కవారికోసం బతికేస్తారు. కాబట్టి.. తమకోసం తాము నిలపడేలా.. ఈ రాశి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. 

click me!